నా దగ్గర రికమండేషన్లు పనికిరావు ఎస్సై వెంకట్ రెడ్డి
మందు బాబులకు హెచ్చరిక
ఎస్సై వెంకట్ రెడ్డి దగ్గర రికమండేషన్లు పనికిరావు......!
ఎవరి పేరు చెప్పినా వదిలేది లేదు....
మండల వ్యాప్తంగా నాఖ బంది....
పలు వాహనాలపై కేసు నమోదు .....
తిరుమలగిరి 31 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఇకపై ఎవరి పేర్లు, పరిచయాలు పనిచేయవని సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల సబ్ ఇన్స్పెక్టర్ గుత్త వెంకటరెడ్డి స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు నాకాబంది నిర్వహించడం జరుగుతుందని అన్నారు మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వెంటనే కొందరు అలాగే “మా డాడీ ఎవరో తెలుసా?”, “మా అంకుల్ ఎవరో తెలుసా మా..అమ్మ నాన్న అన్న ఎవరో తెలుసా మా బావ ఎవరో తెలుసా” అంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంటారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే అలాంటి బెదిరింపులకు, రికమండేషన్లకు తన దగ్గర ఎలాంటి స్థానం లేదని తేల్చిచెప్పారు. ఎస్సై వెంకట్ రెడ్డి తనదైన స్టైల్‌లో మాట్లాడుతూ, డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చిన్న తప్పు కాదని, అది ఇతరుల ప్రాణాలతో ఆడుకునే ప్రమాదకరమైన నేరమని పేర్కొన్నారు. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల అనేక కుటుంబాలు అనాధలవుతున్నాయని, అలాంటి ఘటనలను అడ్డుకోవడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే మాత్రం ఎలాంటి మినహాయింపులు ఉండవని, వాహనాన్ని పక్కన పెట్టించి కేసు నమోదు చేసి, నిర్ణీత తేదీన కోర్టులోనే పరిచయం అవుతామని హెచ్చరించారు. ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అధికంగా నమోదవుతాయని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ముందస్తుగానే మందుబాబులకు హెచ్చరికలు జారీ చేస్తున్నామని అన్నారు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఆయన తీసుకుంటున్న కఠిన వైఖరిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మొత్తానికి, ఎవరు తెలిసిన సరే, చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ వెంకన్న, కానిస్టేబుల్స్ ఫరీద్, మురారి సైదులు, హరి బాబూ, సైదులు, శివారెడ్డి, కళింగ రావు, సంజీవ చారి, రమేష్, ప్రసాద్, లావణ్య, అనుష పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.