ప్రైవేట్ విద్యాసంస్థల్లో పుస్తకాల అమ్మకాన్ని నిషేధించాలి...... పచ్చిపాల రామకృష్ణ

Jun 8, 2024 - 20:36
Jun 8, 2024 - 20:44
 0  33
ప్రైవేట్ విద్యాసంస్థల్లో పుస్తకాల అమ్మకాన్ని నిషేధించాలి...... పచ్చిపాల రామకృష్ణ

మునగాల  08 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలలో పుస్తకాలు మరియు యూనిఫార్మ్స్ తదితర విక్రయాలను పూర్తిగా నియంత్రించాలని బిసి విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మునగాల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యాసంస్థలలో పుస్తకాల విక్రయాల వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నర్సరీ ఎల్కేజీ విద్యార్థులకు కూడా పుస్తకాల రేటు వేలల్లో ఉంటుందని ఫీజుల విషయానికొస్తే వేల నుండి లక్షల్లో దోచుకుంటున్నారని ఆయన అన్నారు అన్నారు

 ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 2010 లో విడుదల చేసిన జీవోను పకడ్బందీగా అమలు చేసి పుస్తకాలను యూనిఫాం ను విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కడైనా కొనుక్కునే స్వేచ్ఛని ఇవ్వాలని అన్నారు విద్యను వ్యాపారం చేస్తూ అధిక పీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని అన్నారు 90 శాతం మంది ప్రజలు ఫీజులు కట్టలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని ఉన్నారు

 ప్రభుత్వం కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థల ఒత్తిళ్లకు లొంగకుండా పేద ప్రజల ప్రయోజనాల కోసం విద్యార్థుల తల్లిదండ్రులతో విద్యార్థి సంఘాల నాయకులతో ఫీజుల నియంత్రణ కమిటీ వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాసంస్థలలో ఫీజులను నియంత్రించి పేద ప్రజల పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకోవాలని ఆయన అన్నారు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలంపల్లి సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు విద్య హక్కు చట్టంను పకడ్బందీగా అమలు చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసి మంత్రులు ఎమ్మెల్యేలు ఉద్యోగస్తుల పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివిస్తేనే ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుందని అన్నారు ఫీజులను నియంత్రించకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State