అయ్యప్ప స్వామి దేవాలయంలో వార్షికోత్సవ వేడుకలు

Jun 8, 2024 - 20:27
Jun 8, 2024 - 20:45
 0  36
అయ్యప్ప స్వామి దేవాలయంలో వార్షికోత్సవ వేడుకలు

మునగాల 08 జూన్ 2024  తెలంగాణవార్త ప్రతినిధి :- మునగాల మండల కేంద్రంలోని గ్రామ శివారులో ఉన్న శ్రీహర హర సుత అయ్యప్ప స్వామి దేవాలయంలో 11 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వార్షికోత్సవంలో భాగంగా శనివారం తెల్లవారుజామున స్వామి వారి సుప్రభాత సేవ అభిషేకము అనంతరం యజ్ఞ హోమాలు తో పాటు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీనివాసచారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ఈ సంవత్సరం 11వ వార్షికోత్సవంలో భాగంగా దాతల సహకారంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో పురోహితుల రామారావు నల్లపాడు శ్రీనివాస్ నల్లపాటి నాగరాజు దేవినేని రవి శెట్టి గిరి గాయం శ్రీనివాస్ రెడ్డి దేవినేని నాగేశ్వరరావు మామిడి శ్రీను భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State