శాంతిసంఘ సమావేశం నిర్వహించిన సూర్యాపేట డిఎస్పి రవికుమార్

Sep 6, 2024 - 18:20
Sep 6, 2024 - 18:22
 0  12
శాంతిసంఘ సమావేశం నిర్వహించిన సూర్యాపేట డిఎస్పి రవికుమార్

ముఖ్య అతిథిగా హాజరైన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్

 శ్రీమతి పేరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్.

శాంతి సంఘ సమావేశం నందు హాజరైన వివిధ మతాల పెద్దలు,

గణేశ ఉత్సవ కమిటీ లు, పౌరులు, ప్రభుత్వ శాఖల అధికారులు

ఈనెల 7వ తారీకు నుండి నిర్వహించనున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు గణేష్ మండపాల ఏర్పాట్లు గణేష్ విగ్రహాల ఏర్పాటు కు సంబంధించి పబ్లిక్ క్లబ్ నందు సూర్యాపేట డీఎస్పీ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణ శాంతి సంఘ సమావేశం జరిగినది. ఈ సమావేశం నందు సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ హాజరై మాట్లాడారు. భద్రతాపరంగా తీసుకోవాల్సిన ఏర్పాట్లు మొదల వంశాలపై సూర్యాపేట డిఎస్పి రవికుమార్ తోపాటు సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్  సూచనలు సలహాలను అందించారు.

నవరాత్రుల సమయంలో శోభాయాత్ర సమయంలో విగ్రహాల ఏర్పాటు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మత పెద్దలు ఉత్సవ కమిటీ సభ్యులు సూచనలను చేశారు. సూర్యాపేట పట్టణంలో ప్రశాంత వాతావరణలో ఉత్సవాలు జరుగుతాయి, మత ఘర్షణలకు ఇక్కడ తావులేదు, ఆదర్శవంతమైన పట్టణం అని ఉత్సవ కమిటీ వారు తెలిపినారు. ఘర్షణలు లేని ఉత్సవ వాతావరణాన్ని భవిష్యత్తులో కొనసాగించాలని, సోషల్ మీడియాలో వచ్చే వదంతలు నమ్మవద్దు అని, ఉత్సవ కమిటీలు ఎల్లప్పుడు మండపాల అందుబాటులో ఉండాలని కోరారు. ఇప్పటివరకు గణేష్ ఉత్సవాల సమయంలో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకపోవడం చాలా సంతోషకరమైన విషయమని ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలని భవిష్యత్తులో కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా తమ వంతుగా ఉత్సవ కమిటీలు పాత్ర పోషించాలని కోరారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు పటిష్ఠమైన పోలీసు భద్రత ఉంటుంది, నిమర్జనం అయ్యే వరకు ప్రతి గణేష్ మండపానికి 24 గంటలు భద్రత కల్పిస్తాం, సిఫ్ట్ ల వారీగా సిబ్బంది విధులు నిర్వహిస్తారు అన్నారు.

ఉత్సవాలను ఒకరిపై ఒకరు పోటీ కోసం జరప వద్దని అందరూ కలిసిమెలిసి భక్తి భావంతో ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని ఎస్పి గారు విజ్ఞప్తి చేశారు. గణేష్ విగ్రహాల ఏర్పాటుకు మండపాల ఏర్పాటుకు ముందస్తుగా ఆన్లైన్ అనుమతులు తీసుకోవాలని కోరారు. ఎక్కడ ఏ విగ్రహం ఏర్పాటు చేశారనేది పోలీసు వారి దృష్టిలో ఉంటే భద్రత కల్పించడం సులువు అవుతుంది, సెక్టార్ల వారీగా పోలీస్ సిబ్బంది అనుక్షణం విధులు నిర్వహిస్తారని తెలిపారు. మండపాల ఏర్పాటు సమయంలో నాణ్యమైన సామాగ్రి ఉపయోగించాలి, మంచి కరెంట్ వైర్ ఉపయోగించాలి, మండపాల వద్ద ఫైర్ సేఫ్టీ కోసం నీటి బకెట్స్, ఇసుక బకెట్స్,  వంట సోడా అందుబాటులో ఉంచుకోవాలి, ఉత్సవ కమిటీ అవారు అందుబాటులో ఉండాలి అని కోరారు.

వివాదాస్పదమైన స్థలం లో మండపాలు ఏర్పాటు చేయొద్దు, రోడ్లపై ఏర్పాటు చేయొద్దు, అలాగే పరమత మందిరాలకు, హాస్పటల్ లకు, స్కూల్స్ కు, వృద్దాశ్రామాలకు దగ్గర మండపాలు ఏర్పాటు చేయొద్దు. సామాన్యులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. నిమర్జనం శోబాయాత్ర లో ఉపయోగించే వాహనం కండిషన్ లో ఉండాలి, పిల్లలను శోభాయాత్ర వాహనాలు ఎక్కించవద్దు అని కోరారు. లక్కీ డ్రాలు నిర్వహించవద్దు. DJ లు పూర్తిగా నిషేదం, DJ లు పెట్టినా, ప్రోత్సహించిన కఠిన చర్యలు ఉంటాయని ఎస్పి గారు హెచ్చరించారు. బానా సంచా నిషేదం. భక్తి పాటలు ప్రసారం చేయాలి, రాత్రి 10 గంటల తర్వాత మైక్ లు పెట్టవద్దు అని విజ్ఞప్తి చేశారు. మట్టి గణేష్ ను ఏర్పాటు చేయడం పర్యావరణానికి మంచిది అని కోరారు. సోషల్ మీడియాలో వచ్చే అదంతాలను, తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దు, తప్పుడు సమాచారంతో ఎవ్వరూ ఉద్రేకానికి లోనై చట్ట ఉల్లంఘనకు పాల్పడవద్దు, ఏదైనా ఉంటే అధికారుల దృష్టికి తెచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని అన్నారు. అన్నీ శాఖల సమన్వయంతో ముందుకు వెళతాము అన్నారు.పర్యావరణ రక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని మట్టి విగ్రహాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉత్సవాల నిర్వహణలో ప్లాస్టిక్ ను వినియోగించవద్దని కోరారు.

అధికారులు ఉత్సవ కమిటీలు సమన్వయంతో పని చేయాలని ఉత్సవాలను ప్రశాంతంగా జరపాలని అన్నారు ఉత్సవాలలో శానిటేషన్ విభాగం చాలా ముఖ్యమైనదని అన్ని విగ్రహాల వద్ద శానిటేషన్ చర్యలు తీసుకుంటాం,నిమర్జన ప్రాంతాల్లో లైటింగ్ ఏర్పాట్లు, గజ ఈతగాల్లు అందుబాటులో పెట్టడం, శానిటేషన్ చేయడం.ఈ సమావేశం నందు సూర్యాపేట పట్న మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్, కౌన్సిలర్లు తాహెర్ పాషా, కక్కిరేణి శ్రీనివాస్, పుర ప్రముఖులు ఆకుల లవకుశ, వల్దాస్ జానీ, గండూరి రమేష్, జటోత్ మకట్లాల్, బైరు వెంకన్న,సీఐ రాజశేఖర్,రూరల్ సీఐ సురేందర్ రెడ్డి,పట్టణా మతాల పెద్దలు, పౌరులు,విద్యుత్ శాఖ, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333