బాధితుల కుటుంబ సభ్యుల పట్ల అవహేళనగా  మాట్లాడిన డిండి ఎస్. ఐ.

Jun 8, 2024 - 20:42
 0  31
బాధితుల కుటుంబ సభ్యుల పట్ల అవహేళనగా  మాట్లాడిన డిండి ఎస్. ఐ.

తెలంగాణ వార్త డిండి మండల ప్రతినిధి :

కేసు విషయంలో మాట్లాడడానికి పోలీస్ స్టేషన్ కు విచ్చేసిన నిందితుల కుటుంబ సభ్యుల పట్ల అవహేళనగా మాట్లాడిన డిండి ఎస్. ఐ. పట్ల చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. పూర్తి వివరాల్లోకెళ్తే డిండి మండలం గోనబోయినపల్లి గ్రామానికి చెందిన  వీఆర్ఏ రంగడంపల్లి కృష్ణయ్య(78) ఫిబ్రవరి 8వ తేదీన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న కేసు విషయంలో మాట్లాడడానికి బాధితుల కుటుంబ సభ్యులు  శనివారం డిండి పోలీస్ స్టేషన్ కు విచ్చేశారు. మధ్యాహ్న సమయంలో బాధితుల కుటుంబ సభ్యులు మహిళలు పోలీస్ స్టేషన్లో  ఎస్సై రాజును కలిసి తమ బాధను చెప్పుచుండగా ఎస్సై పరుష పదజాలంతో మహిళలు అని చూడకుండా వారితో మాట్లాడడం జరిగిందని బాధితులు తెలిపారు.

 మహిళలు అని చూడకుండా అమర్యాదగా ప్రవర్తించిన ఎస్సై తీరుపట్ల మహిళలు ఆవేదన చెందుతూ తమగోడును విలేకరుల ముందు వాపోయారు. ఉన్నతాధికారులు ఎస్సై తీరు పట్ల తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇట్టి విషయంలో ఎస్ఐ రాజుని వివరణ కోరగా...నిందితుల కుటుంబ సభ్యుల పట్ల అమర్యాదగా మాట్లాడలేదని ఆయన తెలిపారు. ఇట్టి విషయంలో బాధితుల కుటుంబ సభ్యులు పందుల కృష్ణమ్మ, రగడంపల్లి అలివేలు, రగడంపల్లి అనూష, రగడంపల్లి లక్ష్మీ, రగడంపల్లి చిన్ననారయ్య, బర్పటి పెద్ద పెద్దయ్య పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333