మల్దకల్ పంచాయతీ స్థలాన్ని కబ్జా కాకుండా కాపాడాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి
బి ఆంజనేయులు.
జోగులాంబ గద్వాల 7 అక్టోబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:-
మల్దకల్. గ్రామ పంచాయతీ కి సంబంధించిన 2ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) ని కలసి విజ్ఞప్తి చేశారు .
ఈసందర్భగా మల్డకల్ గ్రామపంచాయతీ పరిధిలోని sy no 98/B లోని 2ఎకరాల స్థలం ఉన్నదని ఇది గత కొన్ని సంవ్సరాలుగా కోర్టులో కేసు నడుస్తుందని అయితే ప్రస్తుతం కొందరు పంచాయతీ నిధులు కాకుండా సొంత డబ్బులు వెచ్చించి పంచాయతీ స్థలంలో గ్రామం కోసం అంటు షాపులు కట్టి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తూన్నట్లు తమ దృష్టికి వచ్చిందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు అడిషనల్ కలెక్టర్ కి వివరించారు.
గతంలో మా స్థలం అంటు కొందరు ప్రయత్నం చేసి కోర్టులకు వెళితే ఇప్పుడు ఏకంగా కబ్జాలకు కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారని తెలిసిందని పేర్కొన్నారు. కావున జిల్లా కలెక్టర్&అడిషనల్ కలెక్టర్లు (రెవెన్యూ, స్థానిక సంస్థలు) దీనిపైన సమగ్ర కార్యాచరణ చేసి అస్థాలన్ని రక్షించడంతో పాటు ఒకవేళ ఎవరైనా కబ్జాలకు ప్రయత్నించినట్లు తేలితే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.