ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బతుకమ్మ సంబరాలు డాక్టర్"బి భార్గవి

Sep 28, 2025 - 11:03
Sep 28, 2025 - 11:03
 0  6
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  బతుకమ్మ సంబరాలు డాక్టర్"బి భార్గవి

అడ్డగూడూరు 27 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బందితో కలిసి బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించిన డాక్టర్"బి.భార్గవి తీరక్క పువ్వులతో బతుకమ్మను పేర్చి ఆటపాటల నడుమ ఆనందంగా జరుపుకున్నారు.అనంతరం డాక్టర్"బి.భార్గవి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో తప్ప పువ్వులను పూజించే సంప్రదాయం ఏ రాష్ట్రంలో లేదన్నారు.పువ్వులను మహిళలు దైవంగా పూజించే ఈ సంప్రదాయం మన తెలంగాణ రాష్ట్రానికె దక్కిందన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్"బి భార్గవి తో పాటు కార్యాలయం సిబ్బంది.ఏఎన్ఎంలు,వివిద గ్రామాల ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.