వికలాంగుల పెన్షన్లలో కేంద్ర ప్రభుత్వం వాటా 5వెలకు పెంచాలి!

రాష్ట్ర సహాయ కార్యదర్శి వనం ఉపేందర్

Oct 20, 2024 - 21:46
Oct 20, 2024 - 21:50
 0  13
వికలాంగుల పెన్షన్లలో కేంద్ర ప్రభుత్వం వాటా 5వెలకు పెంచాలి!

మోత్కూరు 20 అక్టోబర్ 2024 తెలంగాణావార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో నాలుగో మహాసభ లను నిర్వహించారు. వికలాంగులకు అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి అక్టోబర్ 25-26 తేదీల్లో హైదరాబాద్ లో ఎన్ పి ఆర్ డి రాష్ట్ర 4వ మహాసభలుఎన్ పి ఆర్ డి  రాష్ట్ర సహాయక  కార్యదర్శి  మనం ఉపేందర్. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక మోత్కూరు టౌన్ లో  మండల కమిటీ సమావేశం  ఎర్రవెల్లి నాగేశ్వర్.అధ్యక్షతన జరిగింది ఈసమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై  రాష్ట్ర సహాయక కార్యదర్శి వనం ఉపేందర్  హాజరై మాట్లాడుతూ.. దేశంలో తిండి లేక 10 కోట్ల మంది అల్లాడుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు మోడీ పాలనలో నిరుద్యోగం పెరిగిందని అన్నారు. నిత్యావసర సరకుల ధరలు 300 శాతం పెంచి పేద, మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులకు గురించేస్తున్నారని అన్నారు.

 జిఎస్టీ తీసుకువచ్చి ప్రజలపై భారలు వేసి సంపన్నులకు లక్షల కోట్ల రాయితీ ఇచ్చే హక్కు మోడీకి ఎక్కడిదాని ప్రశ్నించారు. పేదరికం తగ్గిందని చెపుతున్న మోడీ 81కోట్ల మందికి ఉచిత బియ్యం పంపిణి ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు 2014 వరకు 55లక్షల కోట్లు అప్పు చేస్తే, మోడీ పరిపాలించిన 10ఏండ్ల కాలంలో 113 లక్షల కోట్ల అప్పు చేశారని, మోడీ పుణ్యాన దేశంలో ప్రతి ఒక్కరి తలపై 1,02,000 రూపాయల అప్పు పడిందని అన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు.10 లక్షల ప్రాథమిక ఉప వైద్య కేంద్రాలు ఉండాల్సిన చోట కేవలం లక్ష నలభై ఆరు కేంద్రాలతో అందరికి వైద్యం ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. ఏటా 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ 10 ఏండ్ల కాలంలో కేవలం 7వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చామని పార్లమెంట్లో ప్రకటించరని అన్నారు.రైల్వేలో ఉడవడం, కడగడం లాంటి పనుల కోసం 35వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే 1.25కోట్ల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని అన్నారు.

దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత వికలాంగులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను రద్దు చేయాలని కుట్రలు చేస్తుంది.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వికలాంగులపై దాడులు, మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి వాటిని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందింది.కేంద్ర ప్రభుత్వం 2011నుండి వికలాంగులకు 300 రూపాయలే పెన్షన్ ఇస్తుందాని ధరల పెరుగుదలకు అనుగుణంగా పెన్షన్ 5వేలలకు పెంచాలని డిమాండ్ చేశారు.ఇప్పటి 2016 ఆర్ పి డి చట్టానికి కమిషనర్ ను నియమించలేదు. నేషనల్ ట్రస్ట్ కు చైర్మన్ నియమించలేదు.9 నేషనల్ ఇన్స్టిట్యూట్ ను 4 సంస్థలుగా విలీనం చేయాలనీ నిర్ణయం చేసింది.నేషనల్ ఇన్స్టిట్యూట్స్ లలో కొత్త నియమాలు చేయడం లేదు.కేంద్ర ప్రభుత్వ సర్వీస్ ఉద్యోగ నియామకాల్లో వికలాంగులకు మినహాయింపు చేయాలనీ నిర్ణయం చేస్తే కోర్ట్ తీర్పు తో వెనక్కి తగ్గింది. ఎంపీ నిధులలో వికలాంగులకు కేటాయించిన నిధులు ఖర్చు చేయలేదు. కేంద్ర ప్రభుత్వ రంగా సంస్థల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్ లాక్ పోస్టులు భర్తీ చేయడం లేదు. రైల్వే లో రాయితీ పాసులు రద్దు చేయడానికి కుట్రలు చేస్తుంది. దేశ వ్యాపితంగా జిల్లా కేంద్రాల్లో మానసిక వికలాంగులకు హోమ్స్ నిర్మించాలని 2017 మెంటల్ హెల్త్ కేర్ చట్టంలో ఉంది కానీ అమలు చేయలేదు.2016 ఆర్ పి డబ్ల్యు డి 2017 మానసిక వికలాంగుల చట్టం, నేషనల్ ట్రస్ట్, నేషనల్ పాలసి వంటి చట్టాలు అమలు పట్ల పర్యవేక్షణ లేదు, తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులు, వారి సహాయకులకు ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలని చట్టంలో ఎందుకు అమలు చేయడం లేదు.అక్టోబర్ 25-27తేదీల్లో సంఘం రాష్ట్ర 4వ మహాసభలు హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్నామని, 

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.వికలాంగులకు 6వేల పెన్షన్  వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల పెన్షన్ ఎందుకు చెల్లించడం లేదని అన్నారు. పెన్షన్ రాకపోవడం వలన ఆసరా లబ్ది దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పెన్షన్ పెంచకుంటే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.జిల్లా అధికారులు వికలాంగుల సమస్యలు పరిష్కారం చేయడం లేదన్నారు.సదరం క్యాంపు లో అనేక సమస్యలు ఉన్నాయని అన్నారు. వాటిని ఎందుకు పరిష్కారం చేయడం లేదన్నారు. సదరం స్లాట్ సంఖ్య 200లకు పెంచాలని డిమాండ్ చేశారు.ప్రయివేట్ పరిశ్రమలలో వికలాంగులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో 5శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో వికలాంగులపై దాడులు,దౌర్జన్యలు జరుగుతున్న ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్నారు.రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఎమ్మెస్ ఎం ఇ పాలసీ 2024లో వికలాంగులకు ఎందుకు రిజర్వేషన్ అమలు చేయడం లేదని ప్రశ్నించారు.

అనంతారం వాల్పోస్టర్ విడుదల చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో భువనగిరి డివిజన్ ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి, మోత్కూర్ మండల్ అధ్యక్షులు ఎర్రవెల్లి నాగేశ్వర్, ఉపాధ్యక్షులు చేతరాశి నరేష్ ,కాశగాని నరేష్ ,వేముల వెంకన్న దయ్యాల చంద్రయ్య,రావులపూలు సత్తయ్య, బోడ యాకయ్య, గోడిశాల యాదగిరి, వెంట చందు తదితరులు పాల్గొన్నారు.