అధిక ధరలకు కొబ్బరికాయలు అమ్మడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు

Sep 28, 2025 - 20:29
 0  14
అధిక ధరలకు కొబ్బరికాయలు అమ్మడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ అధిక ధరలకు కొబ్బరికాయలు అమ్మడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు* ఆత్మకూరు ఎస్... మండల పరిధిలోని నిమ్మికల్లు శ్రీ దండ మైసమ్మ ఆలయం వద్ద నిబంధన విరుద్ధంగా కొబ్బరికాయలు వేలంపాటదారుడు పది రూపాయలు అధిక ధరకు అమ్ముతున్నట్లు వాటి అరికట్టడంలో ఎండోమెంట్ అధికారి నిర్లక్ష్యం వహిస్తున్నాడని ఆదివారం గ్రామస్తులు నిలదీశారు. నెమ్మికల్ ఆలయo వద్ద ఈఓ జయరామయ్య తో మాట్లాడారు. గత 15 రోజులుగా కొబ్బరికాయల కాంట్రాక్టర్ దండు మైసమ్మ ఆలయం వద్ద చిల్లర కోట్లకు 30 రూపాయలకు ఇవ్వాల్సి ఉండగా 40 రూపాయలు అమ్ముతున్నాడని జిల్లా కలెక్టర్కు స్థానికులు ఫిర్యాదులు చేసినప్పటికీ అదేవిధంగా కొనసాగుతుoడడం తో ఆదివారం గ్రామస్తులు ఈవో జయరామయ్యను నిలదీశారు. నిబంధనలకు విరుద్ధంగా కొబ్బరికాయలు పది రూపాయలకు అధికంగా అమ్మడంతో చిల్లర కోట్ల వాళ్లు 50 నుండి 70 రూపాయల అడ్డగోలుగా విక్రయిస్తున్నారని వారు ఆరోపించారు. కొబ్బరికాయల కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వేస్తున్నారని ఒత్తిడి చేయడంతో కాంట్రాక్టర్ నోటీసులు ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గోపగానిసత్యం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడువీరబోయిన వెంకన్న, వార్డ్ మెంబర్లు కళ్లేపెళ్లి కర్ణాకర్, గోళికర్నాకర్ యడవెల్లి మధు, బుడిగే సైదులు,జటoగి రామ నర్సు, బొప్పని రేణుక, మహేష్ గణేశ్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు *కొబ్బరికాయల కాంట్రాక్టర్కు నోటీసులు అందజేశాను.* ఈఓ జయరామయ్య... దండు మైసమ్మ ఆలయం వద్ద నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు కొబ్బరికాయలు అమ్ముతున్న కాంట్రాక్టర్ కు నోటీసులు అందజేశాను. చిల్లర షాపులు 40 రూపాయలకు కొబ్బరి కాయలు అమ్మే విధంగా ఆలయ సిబ్బంది తో చెప్పించామని తెలిపారు.