వరి పంటలకు ఎస్సారెస్పీ కాలువ నీళ్లు అందించి ఆదుకోవాలని ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా
![వరి పంటలకు ఎస్సారెస్పీ కాలువ నీళ్లు అందించి ఆదుకోవాలని ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా](https://telanganavaartha.com/uploads/images/202502/image_870x_67b0a084997b1.jpg)
తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ఆత్మకూర్ ఎస్ గ్రామాలలో వరి పంటలకు ఎస్సారెస్పీ కాలువ నీళ్లు అందించి ఆదుకోవాలని అఖిలభారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో తాసిల్దార్ ఆఫీస్ ముందు ధర్నా వినతి పత్రం గ్రామాలకు ఎస్సారెస్పీ కాలువ ద్వారా అందిస్తున్న వారబంధినీరు ద్వారా చెరువులు కుంటలు నింపాలని తాసిల్దార్ ఆఫీస్ ముందు ధర్నా ఆర్ ఐ గారికి వినతి పత్రం ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు పోరండ్ల దశరథ పాల్గొని మాట్లాడుతూ ఎస్సారెస్పీ ద్వారా సక్రమంగా అందక రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోతున్నవి ఆరుగాళ్ళం కష్టపడి రైతులు పెట్టిన పెట్టుబడి రాక అప్పుల పాలయ్యే పరిస్థితి నెలకొన్నది, వారబంధిలాగా విడుదల చేసే నీళ్లు కాలువ ముందు భాగాలకే అందుచున్నది నీరు విడుదల చేసిన రెండు నుండి మూడు రోజులుకు నీరు ఈ ప్రాంతానికి వస్తున్నది వచ్చిన నీరు ఎవరికివారు ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారు కాలువలపై లస్కర్లు లేక తూములు మరమతులేక నిండిన చెరువులు కుంటలు మళ్ళీ మళ్ళీ నిండుతున్నాయి ఆత్మకూరు మోతే చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఎండిపోతున్న వరి పంటను కాపాడాలని ఓరి ఎండిపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కాల్వపై లస్కర్లను నియమించి రైతులను ఆదుకోవాలని ఎస్సారెస్పీ కాలువ నీటిని చివరి ఆయకట్టు వరకు అందేటట్లు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తుంది లేనియెడల ప్రజలను రైతన్న కలుపుకొని ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ నాయకులు డేగల వెంకటకృష్ణ, పి వై ఎల్ జిల్లా అధ్యక్షులు నల్గొండ నాగయ్య ఏఐకేఎంఎస్ నాయకులు గునుగంటి శీను పగిడి ఎల్లయ్య భోగిని నాగయ్య మొలకలపల్లి నాగయ్య గురువయ్య శీను సామ వెంకట్ రెడ్డి దాసరి పరమేష్ మేకల వెంకన్న సిలువేరు నరేష్ ఈదుల వీరయ్య అల్సూర్ తదితరులు పాల్గొన్నారు