ఏదులాపురం మున్సిపాలిటీ, వరంగల్ క్రాస్ రోడ్ లో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలి!పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు భూక్య సురేష్ నాయక్
ఏదులాపురం మున్సిపాలిటీ,వరంగల్ క్రాస్ రోడ్ లో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలి
పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు భూక్యా సురేష్ నాయక్ విజ్ఞప్తి.
గ్రంధాలయం లేక ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగ యువతకు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని ఈ రోజు ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ లో ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ గారికి వినతి పత్రం అందించిన పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు భూక్యా సురేష్ నాయక్.నిరుద్యోగ యువతకు సరైన పుస్తకాలు లేక మరియు గ్రంధాలయం లేక ఇబ్బందులు పడుతున్నారు.నిరుద్యోగ యువత ఖమ్మం రూరల్ మండల గ్రంథాలయానికి వెళ్ళాలంటే సుమారు ఏడు కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది.ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని పేద విద్యార్థులకు,నిరుద్యోగులకు కాంపిటేటివ్ పరీక్షలకు చదువుకొనుటకు వీలుగా వారికి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి తగిన పుస్తకాలు ఏర్పాటు చేయగలరని మనవి చేస్తూ భూక్యా.సురేష్ నాయక్ కోరడం జరిగింది.వెంటనే స్పందించిన రూరల్ మండల తహసీల్దార్ గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.వారితో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎన్.పీ చారి,శేష్ రెడ్డి,పవన్ తదితరులు పాల్గొన్నారు