దాడి చేసిన కేసులో A1 నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష , A2 నిందితుడికి ఒక సంవత్సరం జైలు శిక్ష

Sep 13, 2024 - 19:16
 0  2
దాడి చేసిన కేసులో A1 నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష , A2 నిందితుడికి ఒక సంవత్సరం జైలు శిక్ష

నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు ఐపిఎస్  గారు.   నేరం సంఖ్య: 51/2021 U/Sec 448,324,504,506 r/w34 ipc గద్వాల్ రూరల్ పోలీస్ స్టేషన్ : ఫిర్యాది పరమండ్ల నాగరాజు s/o పెద్ద సవారన్న, వయసు -48 సం "లు, R/o మర్లపల్లి గద్వాల్ మండలం అను అతను తేది 24.04.2021 నాడు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆ రోజు ఉదయం తను పశువుల దొడ్డిలో ఉండగా వారి పాలివారు అయిన గోపాల్, వెంకట్రాములు తన పశువుల దొడ్డిలోకి అక్రమంగా ప్రవేశించి తాను తన పొలంకు నీరు పెడుతుండగా కొన్ని నీళ్లు మా పాలివారు అయిన పై వారి పొలం లొకి పొయ్యవని బూతులు తిడుతూ గోపాల్ రాయి తో ఎడమ కాలు పై కొట్టగా రక్త గాయం అయినది అని, మమ్ములను ఇద్దరినీ చంపితే అడ్డూ ఉండదని, ఎప్పటి కైన చంపుతామని అంటూ మరలా వెంకట్రాములు కర్ర తో విసరగా తపించుకున్నానని ఆ సమయంలో గ్రామస్తులు వచ్చి విడిపించగా పై ఇద్దరు చంపుతామని బెదిరిస్తూ వెళ్లారని దరఖాస్తు ఇవ్వగా అప్పటి యస్.హెచ్.ఒ/ ఇన్వెస్టిగేషన్  అధికారి శ్రీకాంత్ రెడ్డి  కేసు నమోదు చేసి దర్యాప్తును పూర్తి చేసి జిల్లా అదనపు ఎస్పీ శ్రీ గుణ శేఖర్ సూచనలతో, డి.ఎస్పి సత్యనారాయణ పర్యవేక్షణలో  గద్వాల్ ఇంచార్జి సిఐ గారు సాక్షులను పకడ్బందీగా బ్రీఫింగ్ చేసి తగిన చర్యలు తిసుకొని నేరస్తులను కోర్టులో ప్రవేశపెట్టగా పూర్వపరాలను విన్న గౌరవ 1st క్లాస్ అదనపు JMFC  మేజిస్ట్రేట్ శ్రీ డి.ఉదయ్ నాయక్ గారు నిందితులలో  A1 కు 3 సంవత్సరాల జైలు శిక్ష, A 2కు ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.
నిందితుల వివరాలు: 
A 1- హరిజన గోపాల్ s/o చిన్న సవారన్న, వయసు -34 సం "లు,A2- వెంకట్రాములు s/o చిన్న సవారన్న, వయసు -48 సం"లు, R/o మర్ల పల్లి, గద్వాల్ మండలం
నిందితులకు శిక్షపడేలా కృషి చేసిన అధికారులు అప్పటి యస్.హెచ్.ఒ/ ఇన్వెస్టిగేషన్ అధికారి శ్రీకాంత్ రెడ్డి,  ప్రస్తుత ఎస్సై శ్రీకాంత్,  ఇంచార్జి సిఐ నాగేశ్వర రెడ్డి, ఏ పిపి కుమారీ రెచల్ సంజనా జాషువా మరియు కోర్టు డ్యూటీ అధికరి గడ్డం రవి లను జిల్లా  ఎస్పీ శ్రీ టి.శ్రీనివాస రావు ఐపిఎస్ గారు అభినందించారు.

జిల్లా పోలీస్ కార్యాలయం
జోగుళాంబ గద్వాల్ జిల్లా

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333