ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలి

Mar 25, 2025 - 20:13
 0  7
ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలి
ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలి

ఆయా సమస్యల పై వచ్చిన పిర్యాదిదారులకు న్యాయం చెయ్యాలి

వేసవి కాలం సందర్బంగా రాత్రి వేళల్లో విసిబుల్ పోలీసింగ్ పెంచాలి

నెల వారి సమీక్ష సమావేశం లో జిల్లా ఎస్పీ శ్రీ  టి. శ్రీనివాస రావు ఐపీఎస్  గారు


 జోగులాంబ గద్వాల 25 మార్చి 2025 తెలంగాణ వార్తా ప్రతిని ధి: ఆయా సమస్యల పై  పోలీస్ స్టేషన్ కు వచ్చిన పిర్యాదిదారులకు న్యాయం చెయ్యడం ద్వారా ప్రజల్లో పోలీస్ పై ఉన్న నమ్మకం మరింత పెరుగుతుందని అలాగే ఆయా పోలీస్ స్టేషన్ లలో నమోదు అయి పెండింగ్ లో ఉన్న కేసులలో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ను పెంపొందించి సత్వర  పరిష్కారం కు బాధ్యతగా కృషి చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు ఐపీఎస్  . పోలీస్ అధికారులకు సూచించారు. 

ఈ రోజు జిల్లా పోలీస్  కార్యాలయంలోని సమావేశ హాల్ నందు జిల్లా ఎస్పీ  పోలీస్ అధికారులతో నెలవారీ నేరసమీక్షా సమావేశం నిర్వహించి ఓల్డ్ UI, గ్రేవ్ కేసులు, ST,SC కేసులు, కాంటెస్టెడ్ కేసులపై  రివ్యూ నిర్వహించారు మరియు నమోదు అయిన కేసులలో శిక్షల శాతం ను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యల పై  సమీక్ష నిర్వహించడం  జరిగింది.పెండింగ్ ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ   మాట్లాడుతూ--   జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి పోలీసు అధికారులందరూ న్యాయధికారులతో సమన్వయం పాటిస్తూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.  పెండింగ్ కేసులను పూర్తిస్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి డిస్పోజల్ చేయాలని సూచించారు. ఫోక్సో ఎస్సీ ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలి.ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలనీ, కోర్టు లలో పెండింగ్ ఉన్న సీసీ నెంబర్ లు త్వరగా తీసుకోవాలని సూచించారు. ఏదైనా కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలనీ,  పోక్సో, ఎస్సీ ఎస్టీ కేసులలో 60 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేయాలని,  ప్రతి కేసులో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలన్నారు. సైబర్ నేరాల్లో త్వరితగతిన పరిశోధన పూర్తి చేయాలన్నారు. వేసవి కాలం సందర్బంగా  దొంగతనాలు జరగకుండా రాత్రి వేళల్లో విజిబుల్ పోలీసింగ్ ను మరింత పెంచాలని అన్నారు. మహిళ శక్తి కి ఇన్స్పిరేషన్ గా నిలిచిన మహిళ పోలీస్ అధికారులు సైతం గస్తి నిర్వహించడం తో పాటు వారి ద్వారా మహిళ కళాశాలలో అవగాహాన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.  ప్రతిరోజు కేసు చేదన గురించి అన్ని కోణాల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎస్ఓపి ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి కేసులు ఛేదించాలని సూచించారు. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ పై దృష్టి సారించాలని,  ప్రతిరోజు ఉదయం సాయంత్రం విజిబుల్  పోలీసింగ్ లో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించాలని, ముఖ్యంగా గూడ్స్ వాహనాలలో కూలీలను తరలించే వారిను గుర్తించి జరిమానాలు, వాహనాలు సీజ్ చెయ్యడం వంటివి చెయ్యాలని, అవసరం అయిన చోట ఆర్గనైజ్డ్ వెహికల్ చెకింగ్ నిర్వహించాలని అన్నారు.

ఆయా కేసులలో అరెస్ట్ పెండింగ్ లేకుండా చూడాలనీ, గస్తీ సిబ్బందిని పెంచీ రాత్రి పెట్రోలింగ్ అధికారులు లాడ్జిలు మరియు పాత నేరస్తులను తనిఖీ చేయాలని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు. సింపుల్ హర్ట్ , ల్యాండ్ డిస్ప్యూట్ కేసులలలో ఇరు వర్గాలను బైండోవర్ చెయ్యాలని సూచించారు. ఇసుక, PDS రైస్ ఎట్టి పరిస్థితులలో అక్రమ రవాణా జరగకుండా చూడాలని సీసీ కెమెరాలను ప్రతిరోజూ మానిటర్ చేయాలని పని చెయ్యని సీసీ కెమెరాలను వెంటనే బాగు చేయించాలని సూచించారు. 

ఈ సమావేశంలో ఈ సమీక్షా సమావేశం లో డి. ఎస్పీ శ్రీ వై. మోగిలయ్య, సీసీ ఎస్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి, గద్వాల్,ఆలంపూర్, శాంతి నగర్ సీఐ లు టి. శ్రీను, రవి బాబు, టాటా బాబు, అన్ని పోలీస్ స్టేషన్ ల ఎస్సై లు, ఆయా విభాగాల ఎస్సై లు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333