జమ్మిచేడు మన్నాపురం ఉప్పేర్ HM లపై చర్యలు తీసుకోండి.సీఐటీయూ డిమాండ్

May 12, 2025 - 19:41
 0  32

జోగులాంబ గద్వాల 12 మే 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: జమ్మిచేడు మన్నాపురం ఉప్పేర్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ డిమాండ్ చేశారు సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో అదనపు కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించారు 


    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పారిశుద్ధ కార్మిలకు ఇచ్చే వేతనాలలో కోత విధించిన జమ్మిచేడు మన్నాపురం ఉప్పేర్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జమ్మిచేడు ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ కార్మికురాలుగా పనిచేస్తున్న సంతోషమ్మకు ఎనిమిది నెలల వేతనాలకు గాను  96,000 ఇవ్వవలసినదిగా కేవలం 42000 మాత్రమే ఇచ్చారని, ధరూరు మండలం మన్నాపురం గ్రామంలోని ప్రధానోపాధ్యాయుడు మొదటి విడతలో 36000 వేతనం  ఇవ్వాల్సి ఉండగా 18000 మాత్రమే ఇచ్చారని,రెండవ విడతలో  కూడా వేతనంలో కోత విధించారని, ఉప్పేర్ పాఠశాలలో పని చేస్తున్న  కార్మికులకు 45000 ఇవ్వాల్సిందిగా కేవలం 30000 మాత్రమే ఇచ్చారని రెండవ విడతలో వచ్చిన వేతనాలు ఇంకా ఇవ్వలేదని సమగ్ర విచారణ జరిపి ఈ ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అదేవిధంగా గద్వాల పట్టణంలోని గంజిపేట మోహన్ మల్లలోని ఉర్దూ తెలుగు మీడియం పాఠశాలలు తూర్కోనిపల్లి తెలుగోనిపల్లి బీరెల్లి తదితర ప్రభుత్వ పాఠశాలలోని కార్మికులకు వేతనాలు విడుదలైన ఇంకా ప్రధానోపాధ్యాయులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు వేతనం కోసం పారిశుద్ధ్య కార్మికులు ఫోన్ చేస్తున్నారని  కొంతమంది ప్రధానోపాధ్యాయులు కార్మికుల ఫోన్ నెంబర్లను బ్లాక్ లిస్టులో పెట్టారని అన్నారు అదేవిధంగా DEO మరియు CPO కార్యాలయ అధికారుల మధ్య  సమన్వయ లోపం కారణంగా డబ్బులు ఉన్నప్పటికీ ఇప్పటివరకు కార్మికులకు రావలసిన ఒక నెల వేతనం విడుదల చేయలేదని అన్నారు జిల్లా వ్యాప్తంగా 80 శాతం ప్రభుత్వ పాఠశాలలో ప్రధానంగా ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికుల పరిస్థితి ఇదేనని, ప్రశ్నిస్తే కొంతమంది  ప్రధానోపాధ్యాయులు  తీసేస్తామని బెదిరిస్తున్నారని అన్నారు  గతంలో ఇదే అంశంపై మండల విద్యాధికారుల దృష్టికి తీసుకువచ్చిన సమస్యను పరిష్కరించలేదన్నారు కొంతమంది ప్రధానోపాధ్యాయులు ఆ నిధులను పాఠశాల అభివృద్ధి కోసం ఖర్చు చేశామని చెబుతున్నారని, కార్మికుల వేతనాలను ఇష్టా రీతిలో  వాడుకునే హక్కు ప్రధానోపాధ్యాయులకు ఎక్కడిదని ప్రశ్నించారు మానవులు విసర్జించే మల  మూత్రాలను శుభ్రం చేస్తున్న పారిశుద్ధ కార్మికుల వేతనాలలో కోత విధించడానికి మనసేలా వచ్చిందని ప్రశ్నించారు  సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉండి కార్మికుల వేతనాలు విషయంలో సమాజం తలదించుకునేలా  వ్యవహరిస్తున్న  ప్రధానోపాధ్యాయులపై జిల్లా వ్యాప్తంగా సమగ్ర విచారణ జరిపించి శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వారం రోజుల్లో కార్మికులకు మొత్తం వేతనాలు చెల్లించకపోతే తాము తీసుకునే భవిష్యత్ కార్యాచరణ వల్ల ఉపాధ్యాయ వ్యవస్థ పైనే గౌరవం పోయే ప్రమాదం ఉందని కావున ప్రధానోపాధ్యాయులు MEO DEO లు వెంటనే స్పందించి కార్మికుల వేతనాలతో కోత విధించిన HM లపై చర్యలు తీసుకోవాలని,పెండింగ్ లో ఉన్న ఒక నెల వేతనం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సంతోషమ్మ సువార్త రేణుక హనీప హాజురంభి మల్లమ్మ శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333