ప్రపంచం గర్వించదగ్గ మేధావి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 

Nov 26, 2024 - 19:56
 0  3
ప్రపంచం గర్వించదగ్గ మేధావి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 
ప్రపంచం గర్వించదగ్గ మేధావి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 

 భావితరాలకు అంబేద్కర్ జీవిత చరిత్రను పూర్తిస్థాయిలో అందించాలి   తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ 

 (సూర్యాపేట టౌన్ నవంబర్ 26 )

ప్రపంచం గర్వించదగ్గ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఈద్గా రోడ్డు లోని రైతు బజార్ వద్ద గల  అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ భారత రాజ్యాంగం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, రాజ్యాంగం, అంబేద్కర్ ఆలోచనలు, భావనల ప్రాముఖ్యతను వ్యాప్తి చేసే లక్ష్యంతో ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపు కుంటారు. అని చెప్పుకొచ్చారు.

75వ భారతరాజ్యాంగ దినోత్సవాన్ని నవంబర్ 26 జరుపుకుంటారు. ఈ రోజును జరుపుకోవడానికి కారణం ఏమిటి ? భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏమిటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రజాస్వామ్య దేశం కోసం.. దేశంలోని పౌరుల హక్కు లు, విధులను రాజ్యాంగం నిర్ణయిస్తుంది. 

ఇది ప్రభుత్వంలోని వివిధ హక్కులు, విధులను కూడా నిర్వచిస్తుంది. రాజ్యాంగం అనేది ఏ దేశంలోనైనా పాలనా వ్యవస్థ, రాష్ట్రాన్ని అమలు చేయడానికి రూపొందించిన పత్రం. రాజ్యాంగం ఆవశ్యకతను గ్రహించి, భారతదేశం కూడా స్వాతంత్ర్యం తర్వాత రాజ్యాంగాన్ని ఆమోదించింది. 

రాజ్యాంగాన్ని రూపొందిం చడానికి, అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి, వారి నుండి మంచి నియమాలు, చట్టాలను సంగ్రహించి భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. భారత రాజ్యాంగం గురించి ప్రజల కు అవగాహన కల్పించడం, రాజ్యాంగం, అంబేద్కర్ ఆలోచనలు, భావనల ప్రాముఖ్యతను వ్యాప్తి చేసే లక్ష్యంతో ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపు కుంటారు. అని పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. భావితరాలకు అంబేద్కర్ జీవిత చరిత్రను పూర్తిస్థాయిలో అందించాలని ఆయన అన్నారు. విద్యుత్తు సౌకర్యం లోని రోజుల్లో ఆయన వీధి దీపాల కింద చదువుకొని గొప్ప మహానీయుడుగా ఎదిగాడు కావున ఈరోజు నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవం గా పేర్కొన్నారు అని పంతంగి వీరస్వామి గౌడ్  అన్నారు.

 

భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1949వ సంవత్సరంలో ఇదే రోజున భారత రాజ్యాంగం ఆమో దించారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్యాం గం ఆవశ్యకత ఏర్పడింది. 

రాజ్యాంగాన్ని రూపొందిం చడానికి రెండు సంవత్స రాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఆ తర్వాత 1949 జనవరి 26న రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రాజ్యాంగం సిద్ధమైంది. అయితే, ఇది అధికారికంగా 26 జనవరి 1950న అమలులోకి వచ్చింది. ఆయన రాసిన రాజ్యాంగం వలనే నేడు చట్టాలు నడుస్తున్నాయని పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు.

ఈ రోజును ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవంగా జరుపు  కుంటారు. ఈ  కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాలు దేవ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాలసైదులు జిల్లా కార్యదర్శి మండాది గోవర్ధన్ గౌడ్ సహాయ కార్యదర్శి తండు సైదులు గౌడ్ పట్టణ గౌరవ సలహాదారుడు మాది రెడ్డి గోపాల్ రెడ్డి పట్టణ కార్యదర్శి అయితే గాని మల్లయ్య గౌడ్ సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్ పట్టణ ఉపాధ్యక్షుడు ఖమ్మం పాటీ అంజయ్య గౌడ్ పటేల్ కిరణ్ సారగండ్ల కోటేష్ రాపర్తి జానయ్య తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333