ఎమ్మార్పీఎస్ జెండా దిమ్మెలు ఏర్పాటు చేయాలి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ఎమ్మార్పీఎస్ జెండా దిమ్మెలు ఏర్పాటు చేయాలి సమావేశంలో మాట్లాడుతున్న యాతాకుల రాజన్న ఆత్మకూర్ ఎస్ : జూలై 7న నిర్వహించబోయే ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని చేయాలని ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం మండల పరిధిలోని నసీంపేట గ్రామంలో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ సంఘాల మండల స్థాయి ముఖ్య కార్యకర్తల వేశంలో ఆయన మాట్లాడారు. అన్ని ఎమ్మార్పీఎస్ దిమ్మెలు నిర్మించాలన్నారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనకై పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారినాయకత్వంలో అలుపెరుగని పోరాటం చేసి ఫలితాలు సాధించుకున్నామని. ఈ ఫలితాన్ని గ్రామస్థాయి వరకు మన జాతి బిడ్డలకు 100 ఏళ్ల భవిష్యత్తు ఉండే విధంగా పోరాట ప్రస్థానం జరిగిందని అదే క్రమంలో ఈ సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అణగారిన కులాల లకు కులాల హక్కులకై పోరాటం చేసి అనేక ఫలితాలు ఎమ్మార్పీఎస్ సాధించామని అన్నారు అన్ని గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి కమిటీలు పునర్నిర్మాణ కమిటీ ఏర్పాటు చేసి జూలై 7 తారీఖున 31వ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జి బొడ్డు విజయ్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మేడి కృష్ణ మాదిగ, మాదిగ కళా నేత గంట బిక్షపతి మాదిగ, ములకలపల్లి పవన్ మాదిగ, బొడ్డు కార్తీక్ మాదిగ, మహేష్ మాదిగ మహేష్ మాదిగ వెంకన్న మాదిగ, రాము మాదిగ, శీను మాదిగ, పగడాల వెంకన్న మాదిగ తదితరులు పాల్గొన్నారు