ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో అబుదాభి లో జరుగు గ్లోబల్ సమ్మిట్ ను విజయవంతం చేయండి

Aug 22, 2024 - 09:45
 0  39
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో అబుదాభి లో జరుగు గ్లోబల్ సమ్మిట్ ను విజయవంతం చేయండి

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో కనివిని ఎరుగని రీతిలో దుబాయ్ లోనీ అబుదాభి లో జరుగు  గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొని విజయవంతం చేయాలని ప్రపంచఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ మీడియా చైర్మన్ కౌటిక్ విఠల్ తెలిపారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15 న దుబాయ్ దేశం లోని అబుదాబిలో గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులందరినీ ఐక్య చేయుటకు ఈ  సమ్మిట్ ను ఏర్పాటు చేయడం జరిగిందనీ అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వామ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ నలుమూల నుండి వస్తున్న ఈ గ్లోబల్ సమ్మిట్ లో భారతదేశ ఔన్నత్యాన్ని తెలిపే సాంస్కృతిక కార్యక్రమాల తో పాటు  సుమారు 50 దేశాల నుండి  వ్యాపార ప్రముఖులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ సమావేశంలో గ్లోబల్ బిజినెస్ సమ్మిట్, వివాహ పరిచయ వేదిక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.సుమారు  3 వేల మంది వామ్  సభ్యులు హాజరవుతున్నట్లు తెలిపారు. వామ్ ఈసీ సభ్యులు ఈగ దయాకర్ గుప్త మాట్లాడుతూ  ఆసక్తిగల వామ్ సభ్యులు గ్లోబల్ సమీట్ లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ  సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మిర్యాల శివకుమార్, ప్రధానకార్యదర్శి బొల్లం సురేష్, కోశాధికారి గుడిపాటి రమేశ్ వామ్ నాయకులు శ్రీకాకోలపు చలపతి రావు, గోపారపు రాజు, బోనగిరి విజయకుమార్, బికుమళ్ల ఉపేందర్, గుండా లక్ష్మయ్య, కారంశెట్టి సత్యనారాయణ, గుముడవెల్లి శ్రీనివాస్, బచ్చు పురుషోత్తం, తప్సి అనిల్ తదితరులు పాల్గొన్నారు. వివరములకు సెల్ 
9440364579, 9848030029 సంప్రదదించగలరు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333