స్కై లైన్ సెలబ్రేషన్ మినీ సినిమా ధియేటర్ ప్రారంభం"ప్రముఖ వైద్యులు జాస్తి సుబ్బారావు గారు

Oct 4, 2024 - 09:53
Oct 4, 2024 - 17:05
 0  3
స్కై లైన్ సెలబ్రేషన్ మినీ సినిమా ధియేటర్ ప్రారంభం"ప్రముఖ వైద్యులు జాస్తి సుబ్బారావు గారు

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో వెంకటేశ్వర దియేటర్ పక్కవీధి శ్రీనివాస్ నగర్ పాత రిజిస్టర్ కార్యాలయం దగ్గరలో స్కై లైన్ సెలబ్రేషన్ మినీ సినిమా ధియేటర్ ను రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించిన ప్రముఖ వైద్యులు జాస్తి సుబ్బారావు కాంగ్రెస్ టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ కందులు కోటేశ్వరరావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటితరం యువత కొంత మంది ఫ్యాషన్ లైఫ్ స్టైల్ ను అలవాటు చేసుకొని తల్లితండ్రుల మాటలు వినే పరిస్థితి లేదని,యువత ఆనందంగా జరుపుకోవలసిన పుట్టిన రోజు వేడుకలు బైక్ ల పై , బ్రిడ్జిల పై రోడ్ల పై ఇబ్బందిగా వేడుకలు నిర్వహించుకోవడం బాధాకరమని అన్నారు,ఇల వినూత్న చర్యలతో వేడుకలు జరుపుకుంటూ తమ తమ కుటుంబానికి ,తల్లితండ్రులకు మరియు బందువుల ప్రేమకు దూరం అవుతున్నారని,ఎంతో మంది ప్రమాద వశాత్తూ గా విషాదాలకు గురౌతుండటాన్ని అందరూ చూస్తున్నారని గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో పట్టణాలలో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు గాను ఈవెంట్స్ లకు గాను ఉపయోగ పడేలా పట్టణాలకు ధీటుగా HD క్వాలటి తో dts సౌండ్ ఏసీ దియటర్ ను కోదాడ పట్టణంలో తీసుకురావడం నేటి తరం పిల్లలకు,యువతకు కుటుంబ సమేతంగా ఆనందాన్ని పంచుకునే అవకాశం కలించినందుకు స్కైై లైన్ వారికి అభినందనలు తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు డేగ శ్రీధర్, కౌన్సిలర్ యాదగిరి ధావల్, శోభన్ ,చైతన్య తదితరులు పాల్గొన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State