జమ్ములమ్మ అమ్మవారి ఆశీస్సులతో నడిగడ్డ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన
- సరితమ్మ....
- జమదగ్ని సమేత జమ్ములమ్మ అమ్మవారి కళ్యాణోత్సవంలో పాల్గొన్న...
- జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ...
జోగులాంబ గద్వాల 27 ఆగస్టు 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- నడిగడ్డ ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ జమదగ్ని సమేత జమ్ములమ్మ అమ్మవారి కళ్యాణోత్సవంలో జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ హాజరైన్నారు... అంతకుముందు శ్రీశ్రీశ్రీ జమ్ములమ్మ మరియు పరశురామ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.. అనంతరం సరితమ్మ మాట్లాడుతూ జమ్ములమ్మ అమ్మవారి ఆశీస్సులతో నడిగడ్డ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని,రైతులు పండించే పంటలు అధిక లాభాలను ఆర్జించి,ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జమ్ములమ్మ సురేష్, ఆనంద్, తిమోతి, గోనుపాడు శ్రీనివాస్ గౌడ్, నాగేంద్ర యాదవ్, డిటిడిసి నర్సింహులు, నాగరాజు, జమ్మిచేడు రాము, వెంకట్రాములు, రవి, వెంకటేష్, కుర్మన్న, కొండపల్లి ఈశ్వర్, ఓబులోనిపల్లి పరుశరాముడు, సమి, రంగస్వామి గౌడ్ తదితరులు ఉన్నారు.