ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఘనంగా నిర్వహించాలి ఆదివాసి ఐక్యవేదిక సంఘాల పిలుపు

Jul 29, 2024 - 19:45
 0  2
ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఘనంగా నిర్వహించాలి ఆదివాసి ఐక్యవేదిక సంఘాల పిలుపు

జులై 29 తెలంగాణ వార్త:- ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఘనంగా నిర్వహించాలని ఆదివాసి సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చారు ఈ మేరకు సోమవారం నాడు ఆర్ ఎం బి విశ్రాంతి భవనం ఆవరణలో ఆదివాసి ఐక్య సంఘాలు మరియు ఉపాధ్యాయ సంఘాలు పాల్గొనడం జరిగింది ఈ సమావేశానికి గొండ్వానా సంక్షేమ పరిషత్ పూనేం సాయి అధ్యక్షత వహించారు.ఆయన అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆదివాసి సంఘల నాయకులు మాట్లాడుతూ.ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఆగస్టు 9న రాష్ట్ర ప్రభుత్వం అధికారకంగా సెలవు దినంగా ప్రకటించి ఆదివాసి అస్తిత్వాన్ని కాపాడేవిధంగా విధంగా చొరవ చూపాలని అన్నారు.అలాగే ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఆదివాసి గూడాలంతా కదిలి ఆదివాసులంతా ఏకమై ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.అనంతరం ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ మన ఏజెన్సీ ప్రాంతంలోని చట్టాలు జీవోలు నిర్వీర్యం అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని  ఈ మేరకు ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి మన ఆదివాసి ఐక్యతను చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి ఐక్యసంఘం నాయకులు  ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333