ప్రతి హెల్త్ ప్రోగ్రాంల యందు జోగులాంబ గద్వాల జిల్లా ముందుండాలి :-డిఎంహెచ్వో డాక్టర్ సిద్ధప్ప

Oct 4, 2024 - 17:02
 0  5
ప్రతి హెల్త్ ప్రోగ్రాంల యందు జోగులాంబ గద్వాల జిల్లా ముందుండాలి :-డిఎంహెచ్వో డాక్టర్ సిద్ధప్ప
ప్రతి హెల్త్ ప్రోగ్రాంల యందు జోగులాంబ గద్వాల జిల్లా ముందుండాలి :-డిఎంహెచ్వో డాక్టర్ సిద్ధప్ప

జోగులంబ గద్వాల నాలుగు అక్టోబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:-గద్వాల జిల్లా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఈరోజు వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సూపర్వైజర్లకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సిద్ధప్ప  సమీక్ష సమావేశం నందు ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి పిఎస్సి అన్ని హెల్త్ ప్రోగ్రాంల యందు  ముందుండాలని సూచించారు... ఈ ప్రోగ్రామ్ల యందు సూపర్వైజర్ లదే కీలక పాత్రయని... టార్గెట్లు, అచీవ్మెంట్లు ముందుగానే మీకు తెలిసి ఉండాలని, క్రింది సిబ్బందితో పని చేయించాలని, 15 రోజులకు ఒకసారి పార్ట్ నైట్ మీటింగ్ ఏర్పాటు చేసుకొవాలని ముఖ్యంగా డెలివరీల సంఖ్యను పెంచాలని, ప్రవేట్ డెలివరీలను తగ్గించాలని  సందర్భంగా తెలిపారు.. ఇట్టి సమీక్షా సమావేశమునకు, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు, డాక్టర్ సంధ్యా కిరణ్ మై, డాక్టర్ నవీన్ కుమార్ రెడ్డి,డాక్టర్ జి రాజు, డాక్టర్ ప్రసూనరాణి, మరియు జిల్లా వైద్య సిబ్బంది  డిడిఎం రాము, Aso తిరుమలేశ్ రెడ్డి, జిల్లా ఎన్సిడి కోఆర్డినేటర్ శ్యాంసుందర్, వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సూపర్వైజర్లు అందరూ ఇట్టి సమీక్ష సమావేశం నందు పాల్గొన్నారు....

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333