మహానీయులు సాక్షి గా పేరుకపోయిన చెత్త చెదారం, ముండ్ల పొదలు పట్టించుకోని మున్సిపాలిటీ అధికారులు

Mar 22, 2026 - 19:10
 0  3
మహానీయులు సాక్షి గా పేరుకపోయిన చెత్త చెదారం, ముండ్ల పొదలు పట్టించుకోని మున్సిపాలిటీ అధికారులు
మహానీయులు సాక్షి గా పేరుకపోయిన చెత్త చెదారం, ముండ్ల పొదలు పట్టించుకోని మున్సిపాలిటీ అధికారులు

పేరుగొప్ప .. ఊరుదిబ్బ అన్న చందంగా తయారైంది . 

జోగులాంబ గద్వాల 22 మార్చి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల  విద్వద్ గద్వాలగా పేరుగాంచిన గద్వాల చరిత్రను మరోతరానికి తెలుపడానికి గద్వాల సంస్థానాదీశయులు, పోరాట యోధులు, కవులు, కళాకారులు, మహానీయులను గుర్తు తెచ్చేందుకు ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఉన్న ప్రహారిగోడపై వారి చిత్రాలను చిత్రీకరించారు. కాని ప్రహారి గోడ ముండ్ల పొదలు , చెత్త పేరుకపోవడంతో మీదున్న మహానీయులు చిత్రాలు కనపడకుండా పోయాయి. చెత్తను కాని ముండ్ల పొదలను తొలగించేందుకు ఆసుపత్రి ‌అధికారులు, మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా గద్వాల పట్టణ అభివృద్ది చేస్తారని ప్రజలు ఆశాభావంవ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా మున్సిపల్ చైర్మన్ మరియు మున్సిపాలిటీ అధికారులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రి ప్రహరీ గోడపై ఉన్న మహనీయుల చిత్రాలకు అడ్డంగా ఉన్నటువంటి చెత్త చెదారం ముళ్లపోదలను తొలగించాలని పట్టణంలోని ప్రజలు జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333