గ్రీన్ పార్క్ కాలనీలో హిందూ సమ్మేళనము ఘనంగా నిర్వహించారు
హైదరాబాద్, 22 మార్చి 2026 (సోమవారం) తెలంగాణ వార్త రిపోర్టర్:- లింగోజిగూడ డివిజన్ గ్రీన్ పార్క్ కాలనీ రోడ్ నెంబర్ 8లో ఆదివారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణం వద్ద ఘనంగా హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. హిందూ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామి, మహిళావక్త మౌనిక సుంకర, ఏడు దొడ్ల శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. కమలానంద భారతి స్వామి మాట్లాడుతూ దేశానికి ఆత్మ హిందూ ధర్మం, హిందూ సంస్కృతీ, హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి సమైక్యపరిచి మన దేశాన్ని తిరిగి విశ్వ గురువుగా నిలపాలనే లక్ష్యంతో నేటి కాలమాన పరిస్థితుల్లో ఎదురవుతున్న అనేక సవాళ్ళను ఎదుర్కొనేందుకు హిందువుల ఐక్యత అవసరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గుర్రం చెన్నకేశవరెడ్డి, నరేందర్ రెడ్డి, బాల్ రెడ్డి, కృష్ణా రెడ్డి నారాయణ రెడ్డి, మహిపాల్ రెడ్డి, రాజిరెడ్డి అవెన్యూ గ్రామర్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి హిందూ బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.