ప్రమాదకరంగా మారిన సీసీ రోడ్డు

Apr 27, 2024 - 20:00
 0  16
ప్రమాదకరంగా మారిన సీసీ రోడ్డు

జోగులాంబ గద్వాల 27 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- మల్దకల్. మండల కేంద్రంలోని దేవాలయం రోడ్డులో ఇటీవల రూ 40 లక్షలతో సిసి రోడ్డు వేశారు. ఐజ గద్వాల రోడ్ నుండి దేవాలయం వరకు సిసి వేయగా దేవాలయ సమీపంలోని 100 మీటర్లు సీసీ రోడ్ నిధులు లేక వేయలేదు. దీంతో సీసీ రోడ్డు ఎత్తు ఉండి ప్రయాణికులు గమనించక పలువురు క్రిందపడి గాయాలపాలయ్యారు. రోడ్డు డౌన్ ఉండడం తో గమనించనీ భక్తులు ఇక్కడికి రాగానే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కనీసం రోడ్డు లెవెల్ కూడా చేయకుండా ఎత్తు ఉండేలా చేసి సీసీ రోడ్డు వేయడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ సూచిక బోర్డైన ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333