ఇంటిని కాల్చినా దీపం ఇరుముడి పూజకు వెళ్ళగా కాలిన ఇల్లు

Dec 12, 2024 - 18:00
Dec 12, 2024 - 18:40
 0  2
ఇంటిని కాల్చినా దీపం ఇరుముడి పూజకు వెళ్ళగా కాలిన ఇల్లు

తెలంగాణ వార్త ప్రతినిధి:- ఇంటిని కాల్చిన దీపం ఇరుముడి పూజలకు వెళ్ళగా కాలిన ఇల్లు..అయ్యప్ప మాల వేసుకున్న వ్యక్తి పూజ కోసం ఇంటిలో వెలిగించిన దీపంఅంటుకొని ఇల్లు పూర్తిగా కాలిపోయిన సంఘటన కోదాడలోని సాయి నగర్ లో చోటు చేసుకుంది. స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం స్థానికంగా నివాసం ఉంటున్న తోగరు సైదయ్య అయ్యప్ప మాల ధరించాడు. కాగా గురువారం ఇంట్లో పూజ చేసి కుటుంబ సభ్యులతో కలిసి ఇరుముడి పూజకు సూర్యాపేట వెళ్ళారు. కాగా దీపం అంటుకొని ఇల్లు కాలి పోయింది. సుమారు 30 లక్షల ఆస్తి నష్టం జరిగిందని భాదితులు వాపోయారు.కాగా ఇల్లు కాలి పోతున్న విషయం గమనించిన స్థానికులు ఫైర్ అధికారులకు సమాచారం యిచ్చారు. ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పి వేశారు. కాగా ఇంటి యజమాని తోగరు సైదయ్య కోదాడ లోని శ్రీరాం చిట్స్ మేనేజర్ గా పని చేస్తున్నట్లు స్ధానికులు తెలిపారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State