ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పండుగ  సందర్భంగా శుభాకాంక్షలు

రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు మరియు భారీ నీటి పారుదల శాఖ మాత్యులు నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి

Mar 20, 2026 - 21:10
 0  1
ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పండుగ  సందర్భంగా శుభాకాంక్షలు

ముస్లిం సోదర, సోదరీమణులకు ( కుటుంబ సభ్యులు) రంజాన్ పండుగ  సందర్భంగా రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు మరియు భారీ నీటి పారుదల శాఖ మాత్యులు నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి  శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, దాన ధర్మాల ద్వారా ఈ పవిత్ర మాసం సహనాన్ని, సేవాభావాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. రంజాన్ పండుగ శాంతి, సౌహార్ద్రం, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని, ప్రతి ఒక్కరూ ఆనందంగా సామరస్యంతో ఈ పండుగను  జరుపుకోవాలని ఆయన సూచించారు. సమాజంలో ప్రేమ, పరస్పర గౌరవం మరింత బలపడాలని, అందరికీ ఆరోగ్యం, సంతోషం కలగాలని ఈ సందర్భంగా మంత్రి ఆకాంక్షించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333