పౌష్టికాహారంతోనే తల్లి, బిడ్డ క్షేమం: ఐసిడిఎస్ సూపర్వైజర్ అరుణ

అంగన్వాడి కేంద్రంలో పోషణ మాంసం గురించి అవగాహన సదస్సు.

Sep 5, 2024 - 19:34
 0  12
పౌష్టికాహారంతోనే తల్లి, బిడ్డ క్షేమం: ఐసిడిఎస్ సూపర్వైజర్ అరుణ

జోగులాంబ గద్వాల 5 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- జిల్లా కేంద్రం లోని తెలుగు పేట సెక్టర్ 20వ వార్డు పరిధిలోని అంగన్వాడి కేంద్రంలలో పోషణ మాసం సందర్భంగా అంగన్వాడి 2వ సెక్టార్ సెంటర్ లో తల్లులకు ఐసిడిఎస్ సూపర్వైజర్ అరుణ గురువారం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ అరుణ మాట్లాడుతూ...పౌష్టికాహారంతోనే తల్లి, బిడ్డ క్షేమంమని,గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టిక ఆహారం పండ్లు, ఆకుకూరలు కూరగాయలు పాలు, మాంసం ఎక్కువగా తీసుకోవాలని తెలియజేశారు, దాని వలన రక్తహీనత లేకుండా సుఖప్రసవము జరుగుతుందని తెలియజేశారు, బరువు తక్కువ పిల్లలు పుట్టడం వలన వారికి ఎలాంటి అనారోగ్యం వచ్చిన తొందరగా కోలుకోలేరని పూర్తి అనారోగ్యానికి గురి అవుతారని తెలియజేశారు.బరువు తక్కువ పిల్లలకు అంగన్వాడి కేంద్రంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని,ప్రతినెల పిల్లల బరువులు తీయించుకొని వారి గ్రోత్ ను తెలుసుకోవాలని అంగన్వాడి టీచర్లకు మరియు తల్లులకు అవగహన కల్పించారు. అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ సెంటర్ లోనే 15రోజులకోసారి బరువును లెక్కిస్తారు అన్నారు. గర్భిణీ స్త్రీలకు పాలిచ్చే విధానం గురించి  సూచించారు.ఈ కార్యక్రమంలో  ఏఎన్ఎం లు సూర్యకాంతమ్మ, రంగమ్మ,ఏ డబ్ల్యు టి ఎస్,ఏ డబ్ల్యు హెచ్, గర్భిణీ బాలింతాలు,తల్లులు పిల్లలు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333