**ప్రజా సమస్యల సాధనకై మార్చి 10 నుండి 26 వరకు సిపిఎం పోరుబాట*

తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ : *ప్రజా సమస్యల సాధనకై మార్చి 10 నుండి 26 వరకు సిపిఎం పోరుబాట*
*ములకలపల్లి రాములు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు*
*************************
పాలకవర్గాలు తన ఎన్నికల వాగ్దానంలో ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మార్చి 10 నుండి 26 వరకు జరుగు పోరు బాట కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు పిలుపునిచ్చారు
శుక్రవారం స్థానిక కోదాడ పట్టణం సుందరయ్య భవనంలో విలేకరుల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాల పేరుతో అధికారులకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 15 మాసాల కాలంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం మినహాయిస్తే ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదని వారు విమర్శించారు. ఇందిరమ్మ గృహాలు, వృద్ధులకు వృద్ధాప్యం పింఛన్ డబ్బులు 2016 రూపాయల నుండి 4016 వరకు పెంచుతానన్న వాగ్దానం తో పాటు మహాలక్ష్మి. గృహలక్ష్మి,. గృహ జ్యోతి,. రైతులకు రుణమాఫీ,. రైతుబంధు. రైతు భరోసా లాంటి పథకాలు నేటికీ అమలుకులో నోసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి గారి మాటలు కోటలు దాటుతున్న చేతలు మాత్రం గడప దాటడం లేదని వారు విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేస్తారని ప్రజలు ఒంటె పెదవుకు నక్క ఆశ పడ్డట్టుగా పథకాలు వస్తాయేమోనన్న ఆశతో వేయికళ్లతో ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రజా పాలన పేరుతో ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు ఒరిగింది ఏమి లేదని వారు ఎద్దేవా చేశారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల సాధనకై మార్చి 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు గ్రామాల్లో పట్టణాలలో సర్వేలు నిర్వహిస్తాం స్థానికంగా పంచాయతీ కార్యదర్శులకు మున్సిపల్ కమిషనర్లకు వ్యక్తిగత సామూహిక సమస్యలపై మెమోరండల్ అందజేస్తాం. మార్చి 17 18 తేదీల్లో అన్ని తాసిల్దార్ కార్యాలయాల ముందు నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. అంతిమంగా మార్చి 26వ తేదీన వేలాది మంది చే సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి చేస్తున్నట్లు రాములు తెలిపారు. ఈ పోరుబాటలో ప్రజలు వేలాదిగా పాల్గొని తమ సమస్యల సాధన కోసం ముందుకు రావాలని పిలుపు నిచ్చారు . ఈ యొక్క విలేకరుల సమావేశంలో సిపిఎం నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు జుట్టు కొండ బసవయ్య సిపిఎం కోదాడ పట్టణ కార్యదర్శి మిట్ట గనుపుల ముత్యాలు , అనంతగిరి మండల కార్యదర్శి రాపోలు సూర్యనారాయణ మహిళా సంఘం నాయకురాలు కుక్కడపు నళిని పట్టణ కమిటీ సభ్యులు దాసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.