లయోలా గోల్డెన్ జూబ్లీ వేడుకలను విజయవంతం చేయాలి

Mar 7, 2025 - 12:30
 0  26
లయోలా గోల్డెన్ జూబ్లీ వేడుకలను విజయవంతం చేయాలి

సూర్యాపేట రూరల్ : జిల్లా కేంద్రంలోని భాషా నాయక్ తండ సమీపంలో ఉన్న లయోలా పాఠశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలను విజయవంతం చేయాలని పాఠశాల కరస్పాండెంట్ ఫాథర్ లూయి దాస్, ప్రిన్సిపల్ ఫాదర్ సునీల్ లు కోరారు. శుక్రవారం కమిటీ సభ్యులతో పాఠశాలలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 1975 - 2025 పాఠశాలలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు ఈ వేడుకలకు హాజరుకానున్నట్లు చెప్పారు. వ్యాపారాలు ఉద్యోగాల్లో విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు సైతం జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. దాదాపు 3,000 మంది పూర్వ విద్యార్థులు హాజరవుతున్నారని ఆ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. సమావేశంలో కోర్ కమిటీ ప్రెసిడెంట్ ఆకారపు రమేష్, వైస్ ప్రెసిడెంట్ పుట్ట కిషోర్, అడ్వైజరి కమిటీ సభ్యులు చలసాని శ్రీనివాస్ రావు, గుర్రం సత్యనారాయణ రెడ్డి, దేవరశేట్టి జనార్దన్,రాచర్ల కమలాకర్, వజ్రయ్య, పూర్వ విద్యార్థులు సైధి రెడ్డి, మద్ది శ్రీనివాస్ యాదవ్, బూర శేఖర్, శ్రీధర్, ఆనంద్, వెంకటరెడ్డి, సైదులు తదితరున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333