పోడు సాగు భూములకు పట్టాలి ఇవ్వాలని
సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో చర్ల రేంజర్ ఉపేందర్ కి వినతిపత్రం
చర్ల జులై 23 తెలంగాణ వార్త:-
పోడు సాగు భూములకు పట్టాలి ఇవ్వాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో చర్ల ఫారెస్ట్ రేంజర్ ఉపేందర్ కి వినతిపత్రం సమర్పించడం జరిగింది అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా పోడు కొట్టుకొని సాగు చేసుకుంటున్న భూములకి పట్టాలి ఇవ్వకుండా ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వం కలిసి భూములు దున్నుకొని ఇవ్వకుండా పంటలు వేసుకునియ్యకుండా వేసిన పంటలను నాశనం చేస్తూ కాలం పబ్బం గడిపిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీలో పీసా 1/70 యాక్టివ్ అటవీ హక్కుల చట్టం ప్రకారం ఏజెన్సీలో ఆదివాసీలకు హక్కులుఅని చెప్పి ఆదివాసులు సాగు చేసుకుంటున్న భూములకి పట్టాలి ఇవ్వకుండా ఆపుతున్నారని వారన్నారు బడా పెట్టుబడిదారులకి కార్పొరేట్ శక్తులకి అటవీ హక్కుల నిబంధనలు ఉల్లంఘిస్తూ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తూ అధికారులు వాళ్లకెట్ల పర్మిషన్లు ఇస్తున్నారో పరిశ్రమలకు బిల్డింగ్ లకి నిర్మాణాలకు ఎలా పరిమిషన్లు ఇస్తున్నారో చర్ల మండల ప్రజలకు చెప్పాలని వారన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో కూడు, గూడు గుడ్డ లేకుండా అర్ధాకలితో అలమటిస్తున్న ఆదివాసులకు ఎకరం భూమి కొట్టుకొని సాగు చేసుకుంటే వీళ్లకు చట్టాలు నిబంధనలు గుర్తుకు రావడం లేదా అని ఆయన అన్నారు తక్షణమే ఏజెన్సీ ఆదివాసులకు వారి హక్కుల ప్రకారం సాగు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని వారు కోరారు?
ఈ కార్యక్రమంలో p o w మహిళా సంఘం జిల్లా నాయకురాలు ఇర్ప సమ్మక్క మంగక్క రాజు తులసి రాసి రమేష్ బయమ్మ రాజమ్మ భవాని సెంకర్ పొడుభూముల సాగుదారులు తదితరులు పాల్గొన్నారు