ప్రతీ ఒక్కరు బాధ్యతయూతంగా  ట్రాఫిక్ నియమాలు పాటించాలి

Jan 17, 2025 - 20:26
Jan 17, 2025 - 20:29
 0  12
ప్రతీ ఒక్కరు బాధ్యతయూతంగా  ట్రాఫిక్ నియమాలు పాటించాలి
ప్రతీ ఒక్కరు బాధ్యతయూతంగా  ట్రాఫిక్ నియమాలు పాటించాలి
ప్రతీ ఒక్కరు బాధ్యతయూతంగా  ట్రాఫిక్ నియమాలు పాటించాలి

తొర్రూరు/ మహబూబాబాద్,MAHABUBBAD,జనవరి.18:-  రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం తొర్రూర్ పట్టణంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్ లో రోడ్ సేఫ్టీ భద్రత  ట్రాఫిక్ నియమాలు పాటించవలసిన జాగ్రత్తలపై మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ మరియు రవాణా శాఖ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి mamidala yashaswini reddy ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు బాధ్యతయూతంగా  ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, హెల్మెట్ ధరించాలని అన్నారు.

అనంతరం రవాణా శాఖ అధికారులు రోడ్ సేఫ్టీ భద్రత  ట్రాఫిక్ నియమాలు పాటించవలసిన జాగ్రత్తలపై వివరిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పక్కాగా పాటించాలని అధిక దూరం ప్రయాణించినప్పుడు విశ్రాంతి తీసుకోవాలని, శీతాకాలం వర్షాకాలం లలో రోడ్డుపై ప్రయాణించే సమయాలలో తీసుకోవలసిన జాగ్రత్తలు, తదితర అంశాలపై అందరికీ అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించారు, జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు, తేదీ జనవరి 1 నుండి 31, వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం హెల్మెట్స్ పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో తొర్రూర్ మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామ చంద్రయ్య, తొర్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, డి టి ఓ జైపాల్ రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం.సాయి చరణ్, మదర్ వాలంటరీ ఆర్గనైజేషన ప్రతినిధి విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. 

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333