పలు ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన జడ్పిటిసి కేశి రెడ్డి వెంకట్ రమణమ్మ, చిన్నారెడ్డి
12-06-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.
చిన్నంబావి మండలంలో పలు ప్రభుత్వ స్కూళ్లను సందర్శించిన చిన్నంబావి మండల జడ్పిటిసి కేసిరెడ్డి వెంకట్రామమ్మ చిన్నారెడ్డి.
ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో చిన్నంబావి బాలికల కస్తూర్బా పాఠశాల మరియు చిన్నమారు గ్రామ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన మండల జడ్పిటిసి కేసిరెడ్డి వెంకట్రామమ్మ చిన్నారెడ్డి. కస్తురిబా పదవ తరగతి విద్యార్థినిలకు పాఠ్య పుస్తకాలను అందిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఉపాధ్యాయుల కొరుత లేకుండా నాణ్యమైన విద్యను అందించే సామర్థ్యం కల్పించాలని ఉపాధ్యా రాళ్లను కోరారు. గ్రామిన ప్రాంతాలలో కానీ పట్టన ప్రాంతాల్లో కానీ ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు తమ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎర్పాటు చేసుకోవాలి,
సగటు సామాన్య ప్రజలకు బరొసగా ఉపాధ్యాయులు తమ పిల్లలను కూడా ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని కొనియాడారు.ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు పిల్లల చదువుల పేరుతో లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆర్థిక ఇబ్బందుల్లో పడకూడదనిచెప్పారు. ప్రతి ఒక్కరు తమ పిల్లలకు చిన్ననాటి నుండి క్రమశిక్షణ అలవాటు నేర్పించాలి అని ఈ సందర్భంగా జడ్పిటిసి తెలిపారు.తమ కూతురులను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించామని తమ కోరిక మేకు ఒకరు ఇంజనీర్ గా ఒకరు డాక్టరుగా రాణించారని దయచేసి తమ పిల్లలపై శ్రద పెట్టి ప్రతి ఒక్కరు తమ పిల్లలను ఒక ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం కల్పించాలన్నారు.