మానవత్వం చాటిన గంట రవీందర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్
కేసముద్రం13 జులై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- మహబూబాద్ జిల్లా కేసముద్రం మండల పరిధిలోని కోరుకొండ పెళ్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన సురేష్ కుమార్తె ఇంటర్మీడియట్ లో తక్కువ మార్కులు వచ్చిందని సూసైడ్ చేసుకున్న సంగతి తెలుసుకున్న మానవత వాది గంట రవీందర్ చేసిన సేవలలో ఇది ఒక సేవ నిరుపేదలకు నా సహాయం అందడమే అది ఒక్క గొప్ప అనుకునే అవకాశమని ఈయన మహాత్మా హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఫౌండర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. మన కులం కాదు, ఊరు, వాడ, ప్రాంతం కాదు. ఫోన్ చేసి కోరుకొండపల్లి సురేష్ ఆర్థిక స్థితి చెప్పేదాకా కూడా పూర్తిగా వినలేదు. వెంటనే 5వేలు రు"నా అకౌంట్ కు పంపారు. పంపిన విషయం కూడా నేను చూసుకునే వరకు తెలియదు. ప్రచారం అవసరం లేదు అంటూ ఎవరికీ చెప్పొద్దూ అంటూ సందేశాన్ని కూడా చెప్పారు.
ఇంత ఎందుకు చెప్పానంటే మానవత్వానికి సంబంధించిన అంశం కాబట్టి. మనం సహాయం చేద్దాం అనుకుంటే మన స్థాయిలో లేకున్నా చుట్టూ ఉన్న వనరులను ఉపయోగించు కోవాలి. ఎవరో ఒకరు మానవత్వం ఉన్న హృదయం ఉన్న రవీందర్ సార్ లాంటి వాళ్ళను పరిశోధన చేయాలి. నేను ఫోన్ పే చేయగానే బాధితులకు లిక్విడ్ అమౌంట్ అందించిన వనం రణధీర్, హరీష్, రాకేష్ లకు అభినందనలు. బాధితులు చెప్పవలసిన అభినందనలు డబ్బులు పంపిన వారు చెప్పినారు అంటే వారి హృదయంలో పేదవాళ్లంటే వారికి ఉన్న ప్రేమ ఆప్యాయత ఆప్యాయత అనురాగం చెప్పలేనంత అలాంటి వ్యక్తికి బాధిత కుటుంబ సభ్యులు ఏనాడు చేసుకున్న రుణ ప్రాప్తి అని గోడును విలపించారు. ఆ దేవుడి మీలాంటి రూపంలో వచ్చి మాకు సహాయ సహకారాలు అందించినందుకు మీకు మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని బాధిత కుటుంభకులు తెలిపారు.