పెద్ద మారు హైస్కూల్లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

Jan 3, 2026 - 18:49
 0  38
పెద్ద మారు హైస్కూల్లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

03-01-2026 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.

 చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన పెద్దమారూర్ జడ్పీ హైస్కూల్లో సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా నిర్వహించారు.

సర్పంచ్,ఉపసర్పంచ్‌లకు మహిళా ఉపాధ్యాయుల ఘన సన్మానం

  చిన్నంబావిమండల పరిధిలోని పెద్ద మారూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే 195వ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కేతపాక జయమ్మ, ఉపసర్పంచ్ నరేష్ యాదవ్,ప్రధానోపాధ్యాయులు రమణమ్మ, అలివేలమ్మలు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం మహిళా ఉపాధ్యాయులు సర్పంచ్,ఉపసర్పంచ్‌లను శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రమణమ్మ,అలివేలమ్మలు మాట్లాడుతూ. భారతదేశ మహిళా జాతికి వెలుగు నింపేందుకు ఒక దేవతామూర్తి అవతరించిన రోజు జనవరి 3, 1831. మహారాష్ట్రలోని నైగావ్, సతారా ప్రాంతంలో జన్మించిన సావిత్రిబాయి పూలే దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా మహిళల జీవితాలకు కొత్త దారి చూపించారు.మహిళలు దేనికీ తక్కువ కాదని నిరూపించిన మహనీయురాలు ఆమె, అని అన్నారు. భర్త జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తూనే, తన స్వంత గుర్తింపును కోల్పోకుండా స్త్రీల విద్య, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగశీలి సావిత్రిబాయి పూలే. ఆమె చేసిన సేవలకు సాష్టాంగ నమస్కారం చేసినా తక్కువే,” అని పేర్కొన్నారు.నేటి యువతీ యువకులు సావిత్రిబాయి పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని, ఆమె అడుగుజాడల్లో నడుచుకుంటూ సమాజ సేవకు అంకితమవ్వాలి,” అని వారు అన్నారు అలాగే,సర్పంచ్ కేతపాక జయమ్మ, లక్ష్మయ్య ఉప సర్పంచ్ ఎం నరేష్ యాదవ్,మాట్లాడుతూ. సావిత్రిబాయి పూలే భారతదేశ మహిళా చరిత్రలో ఒక వెలుగురేఖ. ఆమె మహిళల విద్య కోసం చేసిన పోరాటం వల్లే నేడు అమ్మాయిలు చదువుల్లో, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో ముందుకు వస్తున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే మా లక్ష్యం. ముఖ్యంగా బాలికల విద్యకు ఎలాంటి లోటు రాకుండా గ్రామ పంచాయతీ పూర్తి సహకారం అందిస్తుంది.సావిత్రిబాయి పూలే చూపిన మార్గంలో నడుస్తూ ప్రతి అమ్మాయికి చదువు అందేలా మనమందరం బాధ్యతగా పని చేయాలి. ఆమె ఆశయాలను గ్రామ స్థాయి నుంచే అమలు చేయాల్సిన అవసరం ఉంది.” అన్నారుఈ కార్యక్రమంలో సర్పంచ్ కేతపాక జయమ్మ, ఉపసర్పంచ్ నరేష్ యాదవ్,ప్రధానోపాధ్యాయులు జి.హెచ్.ఎం. రమణమ్మ, అలివేలమ్మ, పి. షబానా బేగం, శివలీల, పుష్పావతమ్మ, భరత్, యాదయ్య, రత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State