ఫోన్ చేస్తే ఇంటికే సూర్యపేట పోలీస్.
తెలంగాణ వార్త సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం, తేది:21/1/26
ఫోన్ చేస్తే ఇంటికే పోలీసులు వచ్చి పిర్యాదులు స్వీకరించి కేసులు నందు చేసి భరోసా కల్పించడం కోసం సూర్యాపేట జిల్లా పోలీసు శాఖ కృషి చేస్తుంది, పోలీస్ స్టేషన్ కు రాలేని ప్రత్యేక పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో ఉన్న బాధితుల నుండి సమాచారం అందుకున్న వెంటనే బాధితుల వద్దకు వెళ్ళి పిర్యాదు స్వీకరించి అక్కడి నుండే కేసు నమోదు చేసి బరోసా కల్పించాలని, పోలీసు సేవల్లో పారదర్శకత కోసం తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ అమలులోకి తెచ్చిన నూతన ప్రణాళిక కార్యాచరణను రాష్ట్ర డిజిపి గారి ఆదేశాల మేరకు జిల్లాలో పటిష్టంగా అమలు చేస్తామని జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ గారు తెలిపినారు. ఈ ప్రణాళిక ప్రకారం ముఖ్యంగా శారీరక దాడులు గురైయ్యే వారికి, ఎస్సి ఎస్టీ వర్గాల ప్రజలకు, బాలలకు, ర్యాగింగ్ కు గురయ్యే విద్యార్థులకు, వేధింపులకు గురయ్యే మహిళలకు, బాలలకు ఎంతో సహాయపడనుంది అన్నారు. దీని ప్రకారం అన్ని పోలీసు స్టేషన్ల సిబ్బందికి, అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగినది అని తెలిపారు. తెలంగాణ పోలీస్ శాఖ ప్రజలకు మరింత సులభమైన సేవలు అందించేందుకు మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది అన్నారు, ఇకపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా బాధితులు తమ ఇంటి వద్ద నుంచే ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పిస్తోంది, ఈ ప్రణాళిక మేరకు పోలీస్ స్టేషన్‌కు రాలేని పరిస్థితుల్లో ఉన్నవారి ఇంటికే పోలీసులు వెళ్లి ఫిర్యాదులు స్వీకరిస్తానని తెలిపినారు.
వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు లేదా భద్రతా కారణాల వల్ల బయటకు రాలేని బాధితులకు ఈరకమైన సేవలు ఉపయోగపడతాయని అన్నారు. ఫోన్ కాల్, ఆన్‌లైన్ అభ్యర్థన లేదా ఇతర మార్గాల ద్వారా సమాచారం అందగానే సంబంధిత పోలీస్ సిబ్బంది బాధితుల నివాసానికి చేరుకుని ఫిర్యాదు నమోదు చేస్తామని తెలిపినారు. ఈ విధానం ద్వారా ఫిర్యాదుల నమోదు ప్రక్రియ మరింత వేగవంతమవడంతో పాటు పోలీస్ వ్యవస్థపై ప్రజల నమ్మకం పెరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా శారీరక దాడులు, అట్రాసిటీ నిరోధక చట్టం కేసులు, బాల్య వివాహాలు, ర్యాగింగ్ నిరోధక చట్టం, మైనర్ వేదింపులు, గృహహింస వంటి కేసుల్లో బాధితులకు ఇది ఎంతో సహాయపడనుంది అన్నారు.