నేను ఓటు వేస్తాను

Mar 26, 2024 - 21:11
Mar 26, 2024 - 21:12
 0  5
నేను ఓటు వేస్తాను
నేను ఓటు వేస్తాను

సూర్యాపేట ప్రతినిధి :- కలెక్టరేట్‌లో మంగళవారం నేను ఓటు వేస్తాను అనే సెల్ఫీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ‘నేను ఓటు వేస్తాను.. ఎందుకంటే.. నేను ఇండియన్‌’ అనే నినాదంతో సెల్ఫీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్వీప్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సెల్ఫీ కేంద్రంలో జిల్లా  కలెక్టర్‌ ఎస్‌. వెంకటరావు, అదనపు కలెక్టర్‌ బీఎస్‌. లతలు ఫొటో దిగారు. ఓటు ప్రాధాన్యతను అందరూ గుర్తించాలని, అందరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని కలెక్టర్‌ కోరారు. వివిప్యాట్, సెల్ఫీ పాయింట్లు మండల కేంద్రాలలో, నియోజకవర్గాలలో సెల్ఫీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికలు పూర్తి అయ్యేంత వరకు ఈ సెల్ఫీ కేంద్రాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యాక్రమంలో  సిఈవో అప్పారావు, డీపీఆర్వో రమేష్, డిఈవో అశోక్, డిటిడివో శంకర్‌,ఎఒ సుదర్శన్ రేడ్డి,  తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333