గ్రామ అభివృద్ధి కోసం కదం తొక్కిన కమలాబాయి
కమలాబాయి మాటే శాసనం మాట నిలబెట్టుకున్న సర్పంచ్ సొంత నిధులతో,కంపతారు చెట్ల తొలగింపు.
03-01-2026 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం : రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇస్తారు. కానీ గెలిచాక వాటిని పట్టించుకునే వారు తక్కువ అయితే వనపర్తి జిల్లా చిన్నంబావి మండల పరిధిలోని బెక్కెo గ్రామ సర్పంచ్ కమలా బాయి మాత్రం ఇoదుకు భిన్నమని నిరూపించినారు తనను నమ్మి గెలిపించి ప్రజల కోసం రెండు సంవత్సరాల కాలంగా రోడ్డు ఇరువైపులా కంపతార చెట్లు వేపుగా పెరగడంతో బాటసారి ప్రయాణికులకు వాహనాదారులకు ఇబ్బందికరంగా ఉండడంతో జెసిపి సాయంతో కంపతార చెట్లను తొలగించారు. గ్రామ సర్పంచ్ ఆదర్శంగా నిలిచారు.కమలాబాయి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించడం జరిగింది. గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి పనులు మొదలు పెట్టారు. అందులో భాగంగానే గ్రామ ప్రజలు ఎప్పటి నుంచో బెక్కెం నుడి మియాపూర్ వెళ్లే రోడ్డుకు ఇరువైపుల ఉన్న కంపతారు చెట్లు, ఫారం కంప తో రాకపోకల యందు ఇబ్బంది పడుతున్నారు. ఇట్టి విషయాన్ని గ్రామస్తులు నూతన సర్పంచ్ కమలాబాయి దృష్టికి తీసుకొని రాగా తక్షణమే ఇరువైపుల ఉన్న కంప చెట్లను తొలగించి గ్రామ ప్రజలకు సరైన రహదారి చేయడం జరిగింది. అదే విధంగా గ్రామ సభకు గ్రామంలో ఉన్న శాఖలన్నియు అందరూ హాజరు అయి ఈ అందరి ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో చర్చించు కోవడం జరిగింది. గ్రామ పంచాయతీ లో ఉన్న వార్డులలో సమస్యలన్నీ పరిష్కరిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు అందరూ సంతోషంతో పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ కమలబాయి, బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు దారాసింగ్, కాంతయ్య ఉప సర్పంచ్ శివ, గ్రామ వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొనడం జరిగింది.