పూడూరులో విద్యుత్ వైర్ల వల్ల ప్రమాదం - దగ్ధమైన గడ్డి ట్రాక్టర్
జోగులాంబ గద్వాల 12 జనవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల్ మండల పరిధిలోని పూడూరు గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం జరిగింది. రైతు తన పొలంలో గడ్డిని నింపుకుని ట్రాక్టర్‌పై ఇంటికి వెళ్తుండగా, మార్గమధ్యలో వేలాడుతున్న విద్యుత్ వైర్లు గడ్డికి తగిలాయి. దీనివల్ల నిప్పురవ్వలు ఎగసి మంటలు వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు భారీగా ఎగసిపడటంతో ట్రాక్టర్‌పై ఉన్న గడ్డి మొత్తం కాలి బూడిదైంది.
ఈ ప్రమాదంలో సుమారు వేల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ ట్రాక్టర్ నుండి దూకేయడంతో ప్రాణనష్టం తప్పింది. గ్రామంలో విద్యుత్ లైన్లు కిందికి వేలాడుతున్నాయని, దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోలేదని గ్రామస్థులు మండిపడుతున్నారు. బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.