బిపి మండల్ జయంతి

Aug 26, 2024 - 14:26
Aug 26, 2024 - 14:34
 0  8

మహనీయుల స్ఫూర్తి వేదిక రాష్ట్ర చైర్మన్

ప్రజావాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్.

బిపి మండల్ జయంతి

బీసీ జాతీయ కమిషన్ చైర్మన్ బిపి మండల్

బడుగుల బాంధవుడు బిపి మండల్

బీసీలకు రిజర్వేషన్లు సాధించిన మండల్

బీసీ రిజర్వేషన్ల ఆద్యుడు మండల్

 ఆదివారం (25.8.2024) రోజు వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో మహానీయుల స్ఫూర్తి వేదిక ఆధ్వర్యంలో  జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ బిపి మండల్106వ జయంతిని ఘనంగా నిర్వహించారు.

 మహనీయుల స్ఫూర్తి వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రజావాగ్గేయకారుడు 
               రాజారాం ప్రకాష్ మాట్లాడుతూ ...........................

   బిందేశ్వర్ ప్రసాద్ మండల్
            ( బిపి మండల్)...................

    బలహీన వర్గాల స్ఫూర్తిప్రదాత బిపి మండల్ యాదవ్, బిసి రిజర్వేషన్ తెచ్చింది బిపి మండల్ యాదవ్,
 బీసీల ఆరాధ్యదైవం బిపి మండల్ యాదవ్  బీసీల చైతన్యం తెచ్చిందే బిపి మండల్ యాదవ్
.......బిపి మండల్ బీహార్ రాష్ట్రంలోని బనారస్ ప్రాంతంలో ఒక సంపన్న యాదవ కులంలో జన్మించాడు 25 వ యేటనే జిల్లా కౌన్సిల్ కి కూడా ఎన్నికయ్యాడు జుడిషియల్ మెజిస్ట్రేట్ గా పనిచేశాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 1952 సంవత్సరంలో మొదటి సారిగా రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి 1967వ సంవత్సరంలో 
ఎం ఎస్ పి పార్టీ ఏర్పాటు చేసి 69 ఎమ్మెల్యే సీట్లను గెలిపించుకుని  1968వ సంవత్సరంలో బీహార్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు 1977 సంవత్సరంలో జయప్రకాష్ నారాయణ మురార్జీ దేశాయ్ తో కలిసి పని చేశాడు జనతా పార్టీ తరఫున పోటీచేసి గెలుపొందాడు
1979 జనవరి ఒకటో తారీఖున మురార్జీ దేశాయ్ బిపి మండల్  బిసికమిషన్ చైర్మన్ గా నియమించాడు మండల్ కమిషన్ 1980 డిసెంబర్ 31వ తారీఖున ప్రభుత్వానికి నివేదికను 40 అంశాలతో కూడినటువంటి విషయాలను పొందుపరిచి నివేదిక సమర్పించారు
 1980 నుండి 1990 వరకు మండల్ కమిషన్ నివేదికను అమలు పరచకుండా అలాగనే ఉంచారు 1993 ఆగస్టు ఏడో తారీఖున విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు అప్పుడు మండల్ కమిషన్ కు అనుకూలంగా వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగాయి బీసీలకు దేశ వ్యాప్తంగా 27 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ కు దక్కింది కానీ ఇంకా 39 అంశాలు ముడిపడి ఉన్నాయి ఇప్పటికైనా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఈ సందర్భంగా ప్రజా వాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

భారత రాజ్యాంగ నిర్మాణం తర్వాత భారత సామాజిక రాజకీయ రగిలించి వేసిన ఘనత బిపి మండల్ కె దక్కింది రాజకీయాల్లో ఉద్యోగ విద్య తదితర రంగాల్లో ప్రాతినిధ్యం లేని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కోసం సాగించిన కృషి చారిత్రాత్మకంగా నిలిచిపోతుంది మండల్ కమిషన్ నివేదిక లేకుండా జాతీయ బీసీ కమిషన్ రాష్ట్ర బీసీ కమిషన్ గాని లేవు భారత రాజకీయ సామాజిక చరిత్ర నిర్మాణంలో కమిషన్ నివేదిక కీలకంగా ఉన్నది 123వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీ  ఎలాగో ఉన్నదో బీసీ కమిషన్ కూడా రాజ్యాంగ ఏర్పాటు విస్తృత అధికారాలు కల్పించారు ఇది మండల్ యాదవ్ యొక్క యొక్క గొప్పదనము
గౌతమ బుద్ధుడు సంతు రవి దాస్ భక్త కబీర్ బసవేశ్వరుడు వీరబ్రహ్మేంద్ర స్వామి మహాత్మ జ్యోతిబాపూలే సావిత్రిబాయి పూలే నారాయణ గురు పెరియార్ రామస్వామి నాయకర్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పండుగ సాయన్న కాన్షీరామ్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో దళిత బహుజనులు అందరూ రాజ్యాధికారం కోసం పోరాటాలు కొనసాగించాలని అందుకయ్యే విద్యను చదువుకోవాలని అప్పుడే సామాజిక న్యాయం దక్కుతుందని అన్నా రు

ఎస్సీ ఎస్టీ బిసి బహుజనుల అందరూ రాజ్యాధికారం కోసం కృషి చేయాలని బహుజన రాజ్యం ఏర్పాటు కోసం బహుజనులు అంతా కలిసి రావాలని బహుజన రాజ్యం ఏర్పడినపుడు ఈ రిజర్వేషన్ల వ్యవస్థ ఉందని ఎవరు ఎంత మందిమో వారికి అంత వాటా దక్కే టట్లు బహుజన ప్రభుత్వాలు కృషి చేస్తాయని  ఈ సందర్భంగా ప్రజా వాగ్గేయకారుడు రాజారాంప్రకాష్ తెలిపారు చేశారు

 ఈ కార్యక్రమంలో
......కవి పండితుడు బూరోజు గిరి రాజాచారి
..... కవి శ్రేష్టుడు వ్యాఖ్యాత డాక్టర్ నాయకంటి నరసింహ శర్మ
..... తెలంగాణ వాల్మీకి సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ మండ్ల దేవన్న నాయుడు
.....ప్రజా గాయకుడు బాలెమియా
..... కళాకారుడు పానుగంటి ఏసోఫ్ 
...... దండోరా రాష్ట్రనాయకుడు తగవుల వెంకటస్వామి. 
...యుటిఎఫ్ జిల్లా నాయకుడు వెంకటేష్ 
... ఎం ఈ ఎఫ్ నాయకులు నరసింహ 
...... ధర్మ ఉపాద్యాయ సంఘం నాయకులు. వెంకటస్వామి 
...కురువయాద సంఘం నాయకులు బక్కయ్య 
....బోయ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులునాయకులు కృష్ణయ్య
.....నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు విజయకుమార్ 
... మాల మహానాడు సంఘం నాయకులు రంగస్వామి 
 .... దళిత సంఘం నాయకుడు దేవని ప్రవీణ్ కుమార్.
 మొదలగు వారు పాల్గొన్నారు

.          ............ మి శ్రేయోభిలాషి
                 ప్రజావాగ్గేయకారుడు
                       రాజారాంప్రకాష్
                              9701141102.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333