పి డి ఎస్ యు రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులను విజయవంతం చేయండి
ఆగస్టు 16,17,18 తేదీలలో జరిగే పి.డి.ఎస్.యు రాష్ట్రస్థాయి విద్యా ,వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయండి*
పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు పి.మహేష్
పి.డి.ఎస్.యు రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులు ఆగస్టు 16, 17, 18 తేదీలలో సిద్దిపేటలో జరుగుతున్నాయని రాజకీయ శిక్షణ తరగతులను విద్యార్థులు జయప్రదం చేసి విజయవంతం చేయాలని పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు పి. మహేష్ అన్నారు
ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పి.డి.ఎస్.యు ఆద్వర్యంలో రాజకీయ శిక్షణ తరగతుల బ్రోచర్స్ ను విడుదల చేయటం జరిగింది.
అనంతరం పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు పి. మహేష్ మాట్లాడుతూ,
ప్రగతి శీల ప్రజాసౌమ్య విద్యార్థి సంఘం(PDSU) పురుడోసుకొని 50 ఏండ్లు నిండింది, ఈ 50 ఏళ్ల ప్రస్థానంలో నిత్యనిర్బంధం అక్రమ అరెస్టులను జైళ్లను ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మరెన్నో విజయాలను సాధించింది.
నేడు విద్యారంగంలో అనేక సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారు, నేడు సోషల్ మీడియా కేరియారిజం వ్యక్తిగత చింతన వలన విద్యార్థుల మెదళ్లను ఆలోజింప చేయకుండా చేస్తుంది. ఈ తరుణంలో విద్యార్థుల సమిష్టి తత్వాన్ని మరింత పెంచి వారిని రాజకీయంగా సాంస్కృతికంగా సామాజికంగా తీర్చిదిద్దడానికి తద్వారా బలమైన విద్యార్థి పోరాటం నిర్మించడానికి, విద్య రంగ సమస్యలను చర్చించి భవిష్యత్ కార్యక్రమాలను రూపొందించుకోవడానికి ప్రగతీ శీల ప్రజసౌమ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 16.17.18 తేదీలలో సిద్ధిపేట జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి విద్య ,వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాము.
ఈ శిక్షణ తరగతులకు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
*ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేబోయిన కిరణ్ కుమార్, పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి, పిడమర్తి భరత్, నాయకులు పూజిత, మహేశ్వరి,స్వాతి,సంధ్య,మహేష్ మనోజ్,వినయ్ తదితరులు పాల్గొన్నారు.*