విద్యార్థి ఉద్యమాల వేగుచుక్క జాజిరెడ్డి..

Sep 26, 2024 - 21:53
Sep 27, 2024 - 08:12
 0  2
విద్యార్థి ఉద్యమాల వేగుచుక్క జాజిరెడ్డి..

విద్యార్థి ఉద్యమాల వేగుచుక్క జార్జిరెడ్డి.

పిడిఎస్యు చరిత్ర అంతా పోరాటలమయం

పిడిఎస్యు 50 వసంతాల స్వర్ణోత్సవాల సందర్భంగా భారీ విద్యార్థి ప్రదర్శన

ఎర్ర అఖిల్ కుమార్ పిడిఎస్యు రాష్ట్ర సహయ కార్యదర్శి

భారత విద్యార్థి ఉద్యమాలకు పిడిఎస్యు దిక్సూచిలా నిలిచిందని, పిడిఎస్యు చరిత్ర అంతా పొరాటలమయం అని పిడిఎస్యు రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ అన్నారు.*ఈ రోజు పిడిఎస్యు 50 వసంతాల స్వర్ణోత్సవం సందర్బంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 60ఫీట్లా రోడ్డు నుండి కొత్త బస్టాండ్ మీదుగా మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వరకు భారీ విద్యార్థి ప్రదర్శన నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా పిడిఎస్యు రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ మాట్లాడుతూ* 50 ఏళ్ల లో విద్యారంగ సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తూ, విద్యార్థుల హక్కుల కోసం, శాస్త్రీయ విద్య సాధన ,సమసమాజ స్థాపనే ద్యేయంగా పిడిఎస్యు పోరాడుతుందని అన్నారు.

నక్సల్భరి, శ్రీకాకుళం, గోదావరిలోయ ప్రతిఘటన పోరాటాల ప్రేరణతో, కత్తుల వంతెన పై నెత్తుటి కవాతు చేసిన పి.డి. ఎస్.యు. 50 యేండ్ల ఉద్యమ ప్రస్థానంలో ఎందరో విద్యార్థి రత్నాలైన జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్,శ్రీపాద శ్రీహరి,కోలాశంకర్,రంగవల్లి, చేరాలు,రమణయ్య, సాంబయ్య,వీరారెడ్డి, రియాజ్ లు తమ వేడి నెత్తురు ను ధార పోశారని గుర్తు చేశారు. పిడియస్యూ ఆవిర్భావం నాటినుండి అధిక ధరలు, అధిక ఫీజులకు వ్యతిరేకంగా, ఆశ్రిత పక్షపాతం, అవినీతికి వ్యతిరేకంగా, కుల వివక్షత, మతోన్మాదానికి వ్యతిరేకంగా, మహిళలపై దాడులు, సంక్షేమ హాస్టల్స్ సమస్యలపై, పెండింగ్ స్కాలర్ షిప్, ఫీజు రియంబర్స్మెంట్ కై, యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేపట్టిందని వారు తెలిపారు.కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, సంఘటితంగా ఉద్యమించాలని అన్నారు. ఈ క్రమంలో 50ఏళ్ల తర్వాత కూడా భవిష్యత్ తరాలకు మరింత ఉత్తేజాన్ని కలిగిస్తూ పిడి ఎస్ యు పోరాటాలు చేస్తుంది అన్నారు. ఈ నెల 30న హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే పిడిఎస్యు 50 ఏళ్ల స్వర్ణోత్సవ సభలో విద్యార్థినీ,విద్యార్దులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు పూర్వ జిల్లా నాయకులు పిడమర్తి లింగయ్య, జిల్లా నాయకులు విజయ్, వినయ్, రాజు, మహిత, లత, రేణుక, మోహన్, శంకర్,రవి తదితరులు పాల్గొన్నారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223