ఐకెపి సెంటర్ ను ప్రారంభించిన సింగిల్ విండో చైర్మన్ బగ్గారి నరసింహారెడ్డి

Nov 25, 2024 - 19:36
 0  18
ఐకెపి సెంటర్ ను ప్రారంభించిన సింగిల్ విండో చైర్మన్ బగ్గారి నరసింహారెడ్డి

25-11-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం. చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన వెల్లగొండ గ్రామంలో సెర్ప్( ఐ.కె. పి. )ఆధ్వర్యంలో ఖరీప్ సీజన్ వరి కొనుగోలు కేంద్రని ప్రారంభించిన కొప్పునూర్ సింగల్ విండో చైర్మన్ బగ్గారి నరసింహ రెడ్డి.

చిన్నబావి మండల పరిధిలోని వెల్లగొండ గ్రామంలో సెర్ప్ (ఐ. కె. పి.) ఆధ్వర్యంలో ఖరీఫ్ వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కొప్పునూరు సింగిల్ విండో చైర్మన్ బగ్గారి నరసింహారెడ్డి.  వారితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొల్లాపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పెబ్బేటి రామచంద్రారెడ్డి,జంగ బిచుపల్లి యాదవ్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, పెబ్బేటి తేజా రెడ్డి, వడ్డెమాన్ బిచ్చన్న, కోటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

ఖరీప్ సీజన్ లో రైతులు పండించిన నాణ్యత ప్రమాణలు కలిగిన ప్రతి గింజా రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని అన్నారు. సన్న రకం వడ్లకు 500 రూపాయలు బోనస్ ముందే ప్రభుత్వం చెల్లిస్తుంది అన్నారు ధాన్యం రేటు క్వింటల్ కు ఏ గ్రేడ్ రకం ధర 2320/- రూపాయలు కామన్ గ్రేడ్ రకం ధర 2300/- రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.  గ్రామాలలోని రైతులు వారి వారి గ్రామాలలోనే వరి కొనుగోలు కేంద్రాలు ఉపయోగిచ్చుకోవాలని దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగరాజు, మహదేవ్ గౌడు, పుల్లయ్య శెట్టి, ఆంజనేయులు, నరేందర్,  వెంకటకృష్ణారెడ్డి, అశోక్ నాయుడు, వెంకటస్వామి గౌడ్, చిన్నఉశన్న నాయుడు, జమ్ములు నాయుడు, రమేష్ కురుమూర్తి గౌడ్, మహిళా సంఘాల సభ్యులు అరుణ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State