స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. రుణమాఫీ చేస్తం.. రైతు భరోసా ఇస్తం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Nov 29, 2024 - 20:23
 0  3
స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. రుణమాఫీ చేస్తం.. రైతు భరోసా ఇస్తం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట: కాంగ్రెస్ కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో అలింగాపురం గ్రామంలో 30 కోట్లతో చేపడుతున్న రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనవరి ఫిబ్రవరి నెలలో జరగనున్నాయని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మంత్రి ఉత్తమ్ పిలుపునిచ్చారు.

రైతుల రుణమాఫీ పూర్తి చేస్తామని, రైతు భరోసా ఇస్తామని మంత్రి ఉత్తమ్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కోదాడ హుజూర్ నగర్ ,నియోజకవర్గం అన్ని స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయాలని అన్నారు. హుజూర్ నగర్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని ఏడుసార్లు నుంచి ఒకే ప్రాంతం నుంచి గెలిపించిన హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటారని అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333