బైకుల దొంగతనం కేసును చేదించిన గద్వాల్ పోలీసులు, ఆరుగురు నిందితుల అరెస్టు
వారి 35 బైకులు స్వాదినం ,వీటి విలువ అందాజా 30 లక్షల రూపాయలు.
జోగులాంబ గద్వాల 2 డిసెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల పరిచయం ద్వారా స్నేహితులు అయి ఒక ముఠాగా మారి రాత్రి సమయాల్లో కాలనీలలో రెక్కి నిర్వహించి ఇండ్ల ముందు నిలిపిన బైక్ లను దొంగతనం చేసి తీసుకెళ్లే ముఠాను గద్వాల్ పోలీసులు ఛేదించి 6 గురు నిందితులను ఉదయం 05:00 గంటల సమయంలో అరెస్టు, వారి నుండి దొంగలించిన 35 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు.
కేసు వివరాలు: తేదీ 28.11.2024 నాడు G. రేణుక r/o హరిజనవాడ, రాంనగర్ గద్వాల టౌన్ అను మహిళా గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయడం ఏమనగా తేదీ 13.11.2024 నాడు రాత్రి సమయంలో తమ ఇంటి ముందు పార్కింగ్ చేసిన యమహా ఫాసినో స్కూటీ ని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించారని ఇట్టి బైక్ యొక్క విలువ అందాజా 40 వేల రూపాయలు ఉంటుందని, కావున తమ బైకు దొంగలించిన వ్యక్తులపై చట్టరీత చర్య తీసుకోవాలని గద్వాల టౌన్ ఎస్ఐ కి ఫిర్యాదు ఇవ్వగా గద్వాల టౌన్ ఎస్ఐ గారు Cr.No 301/2024 u/s 303(2)BNS గా కేసు నమోదు చేయడం జరిగింది.
1.ముద్దాయిల వివరాలు:
1. గాంధీ చిన్న , R/O చింతల పేట, గద్వాల్
2. నాగరాజు R/O చింతల పేట, గద్వాల్
3. వంశీ (Absconding) R/O 2nd రైల్వే గేట్, గద్వాల్
4. రఫీ R/O నల్లకుంట, గద్వాల్
5. నవీన్ R/O దంతనూర్, మధనాపురం మండలం, వనపర్తి జిల్లా
6. వహీద్ R/O కొత్తకోట, వనపర్తి జిల్లా
7. ఆదర్శ్ కొత్తకోట, వనపర్తి జిల్లా
8.రాధాకృష్ణ(Absconding) మధనాపురం మండలం, వనపర్తి జిల్లా
2. గతం లో నమోదు అయిన కేసుల వివరాలు.
గద్వాల్ టౌన్ లో గతంలో నమోదు ఐన 7 బైక్ దొంగతనం కేసులలో నిదితులుగా గుర్తించడం జరిగింది.
3.నేరము చేసిన విధానము:
పరిచయం ద్వారా స్నేహితులు అయి ఒక ముఠాగా ఏర్పడి రాత్రి సమయాల్లో కాలనీలలో రెక్కి నిర్వహించి ఇండ్ల ముందు నిలిపిన బైక్ లను దొంగతనం చేసి తీసుకెల్లీ తక్కువ ధరకు అమ్ముకొని అట్టి డబ్బులతో జల్సాలు చెయ్యడం వీరి పని, వీరిలో కొందరు బైక్ లు దొంగతనం చేయగా మిగిలిన వారు వాటిని కలెక్ట్ చేసుకొని అమ్మి వచ్చిన డబ్బులు పంచుకోవడం వీరిపని, అదే విదంగా గద్వాల్ ఫిర్యాది బైక్ సంబందించి A1: గాంధీ చిన్న మరియు A2: నాగరాజు A3: వంశీ A4: రఫీ ఇట్టి నలుగురు రెండు బైకులపై అర్ధరాత్రి వేళ కాలనీలలో రెక్కీ చేస్తూ హరిజనవాడ రామ్ నగర్ లోని G. రేణుక ఇంటి ముందర ఉన్న యమహా ఫాసినో స్కూటీని మాస్టర్ కి తో అన్ లాక్ చేసి స్కూటీని దొంగలించి అట్టి స్కూటీని A5: నవీన్ కు 20వేల రూపాయలకు అమ్మే సారు.
4.స్వాదిన పరచుకున్న వస్తువులు /స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు;
1. 35 బైకులు(Rayal Enfield-3, HF Delux-4,Apache-1,Activa & other scootys-6, Pulsar-5,Gla mour-2,Passion pro& passion plus-3, Yamaha-2, Honda shine & Honda livo-5, Hero Splendar-2, Unicorn-2) వాటి విలువ అందాజా 30 లక్షల రూపాయలు.
5.నేరము ను చేదించిన విధానము:
శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపిఎస్ గారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జోగుళాంబ గద్వాల జిల్లా వారి ఆదేశాల మేరకు, జిల్లా అదనపు ఎస్పీ శ్రీ కె.గుణ శేఖర్ సూచనల తో శ్రీ కె. సత్యనారాయణ డీఎస్పీ,శ్రీ T. శ్రీను సీఐ గద్వాల స్వీయ పర్యవేక్షణలో శ్రీ కళ్యాణ్ రావు గద్వాల టౌన్ ఎస్ఐ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం ఏర్పాటు చేసి తేదీ 02.12.2024 నాడు ఉదయం 05:00గంటల సమయంలో గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి బైక్ పై అనుమానస్పదంగా రావడం గమనించి అట్టి బైక్ పై వస్తున్న వ్యక్తిని ఆపి వాహనం యొక్క పత్రాలు చూపించమని అడగగా అతను తన దొంగతనం చేసిన ఒప్పుకొని ఇతర నేరాలు కూడా ఒప్పుకోలు చేసినాడు మరియు అతనితోపాటు ఇంకో ముగ్గురు వ్యక్తులు (A2,A3,A4) కలిసి బైక్ దొంగతనాలు చేసిన తర్వాత వాటిని (A5,A6,A7,A8 ) వారికి అమ్మేవారని చెప్పి వీళ్ళు చేసిన ఇతర దొంగతనాలు వివరాలు చెబుతూ దొంగతనం చేసిన బైక్లను చూపించడం జరిగింది.ఈ కేసుకు సంబందించి ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు, వారిని కూడా త్వరలో పట్టుకొని పూర్తిగా దర్యాప్తు చెయ్యడం జరుగుతుంది. ఇట్టి వ్యక్తుల నుండి 35 బైకులను రికవరీ చేయడం జరిగింది, వీటి విలువ అందాజా 30 లక్షల రూపాయలు. ఈ కేసును ఛేదించడం లో ప్రతిభ చూపిన టౌన్ ఎస్సై కల్యాణ్ రావ్, సిబ్బంది చంద్రయ్య PC-3221, ఇస్మాయిల్ PC-3220, లను క్యాష్ రివార్డ్ తో జిల్లా SP ప్రత్యేకంగా అభినందించారు.