ఎన్ని ఆటంకాలు ఎదురైనా లక్ష్యం కోసం కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన శ్రీదేవి

తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.: చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన వెల్టూరు గ్రామానికి చెందిన జంగం నాగేశ్వరమ్మ& జంగం దేవయ్య కుమార్తె జంగం శ్రీదేవి కి ఆటంకాలు ఎన్ని ఎదురైనా, పేదరికం అడ్డు వచ్చినా చదివే ధ్యాసగా లక్ష్యసాధన తోటి, ఉద్యోగలకు అవలీలంగా ఎన్నిక కావడం జరుగుతుంది. వివరాలలోకి వెళితే మారుమూల గ్రామం అమ్మానాన్న ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఇద్దరు అన్నలు చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ చెల్లెలి చదువుకు నిలువెత్తున అండగా ఉంటున్నారు.
చదివే ధ్యాసగా పెట్టుకుని, పేదరికం అడ్డువచ్చిన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని ఓయూ హాస్టల్లో ఉంటూ చదివే ధ్యాసగా ఎంచుకున్న లక్ష్యం కోసం కష్టపడి చదువుతూ ఉన్న క్రమంలో కేజీబీవీ గోపాల్పేట్ లో పీజీ సిఆర్టి టీచరుగా ఎన్నిక కావడం జరిగింది, అక్కడి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూనే తన సాధన కొనసాగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి జూనియర్ కళాశాల అధ్యాపకుల జాబితాలో ఎకనామిక్స్ విభాగంలో ఉద్యోగానికి ఎంపిక అయినది, దీనికి సహకరించిన నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు , తోటి కళాశాల సిబ్బంది, బంధువులు మరియు మిత్రులు నన్ను ప్రోత్సహించిన వారి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు అని జంగం శ్రీదేవి అందరికీ అభినందనలు తెలియజేసింది.