బీసీల కోసం అవసరమైతే పార్టీ పెడతాం: ఆర్.కృష్ణయ్య..!!
హైదరాబాద్: పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని, జనగణనలో కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
హైదరాబాద్ లో జరిగిన బీసీల సమరభేరి మహాసభలో ఆయన మాట్లాడారు. దేశంలో బీసీలందరికీ సమాన వాటా ఉండాలని అన్నారు. బీసీల రాజ్యాధికారం కోసం అవసరమైతే పొలిటికల్ పార్టీ పెట్టేందుకు సిద్ధం అవుతామని తెలిపారు.