44వ డివిజన్ లో ఉన్న రైతు బజార్ శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల

Dec 3, 2024 - 14:54
Dec 3, 2024 - 16:38
 0  31
44వ డివిజన్ లో ఉన్న రైతు బజార్ శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల

తెలంగాణ వార్త ప్రతినిధి:- ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 44వ డివిజన్ లో గల పాత రైతు బజార్ ను గత పాలకులు మూసివేయడం జరిగింది. మళ్ళీ అదే రైతు బజారును రైతుల విజ్ఞప్తి మేరకు స్థానిక 44 వ డివిజన్ కార్పొరేటర్ పాలేపు విజయ వెంకటరమణ గారి ద్రుష్టికి తీసుకెళ్లగా తక్షణమే స్పందించి గౌరవ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారితో మాట్లాడి నేడు మళ్ళీ నూతనంగా శంఖుస్థాపన చేయటం జరిగింది .దీని ద్వారా రఘునాధపాలెం మండల రైతులు తాము పండించిన కూరగాయలను నేరుగా అమ్ముకొనుటకు వెసులుబాటు కల్పించిన గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి మరియు స్థానిక కార్పొరేటర్ పాలెపు విజయ వెంకటరమణ గారికి రఘునాధపాలెం మండలం రైతులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు వాంకుడోత్ దీపల నాయక్, బండి నాగేశ్వర్ రావు, అరివికట్ల ప్రేమ్ కుమార్, యరగర్ల హనుమంతరావు, అరివికట్ల సుధీర్, కొట్టే రాజు, మాధవశేట్టి హనుమంతరావు, డాక్టర్ బాబు, మాలోత్ రాము నాయక్ ,పూర్ణ ,రఘురాం, మరియు మండల రైతులు పాల్గొన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State