పాలిటెక్నిక్ కళాశాలలో గంజాయి మత్తు పదార్థాల పై అవగాహన .

మత్తు జీవితాన్ని నాశనం చేస్తుంది. సీఐ రమేష్ కుమార్
ప్రతి ఒక్కరూ పోలీస్ సేవలను ఉపయోగించుకోవాలి
చుంచుపల్లి జూలై 18: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పాలిటెక్నిక్ కాలేజీలో గంజాయి మత్తుమందు లాపై విద్యార్థి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం టూ టౌన్ పోలీస్ ఎస్ హెచ్ ఓ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసలై ఎంతో మంది యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని. చెడు వ్యసనాల వల్ల కలిగే నష్టాలను కొత్తగూడెం 2టౌన్ పోలీసులు వివరించారు. ఎక్కడైనా గంజాయి విక్రయిస్తున్నట్టు సమాచారం ఉంటే మాకు తెలియజేయాలని మీ పేర్లు గోప్యంగా ఉంచబడతాయని యువతను కోరినారు.యువకులు, విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని మత్తు పానీయాలు అలవాటు చేసుకుంటే ఏ విధంగా తమ జీవితాలను నాశనం అయిపోతున్నాయో వివరించడం జరిగింది.గంజాయి, ఇతర మత్తు పదార్థాలు వినియోగిస్తే ఆరోగ్యం దెబ్బతిని, మతిస్థిమితం కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. నేరాలు చేసే అవకాశం ఉందని.చదువు మానేసి మత్తు పదార్థాలకు అలవాటు పడి కొందరు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఎస్హెచ్ఓ రమేష్ కుమార్ తెలిపారు. బానిసలైన వారు చెడు వ్యవసనాలకు దూరంగా ఉంటూ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కొడుకులు బిడ్డలను ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించుకోవాలని కష్టమైన నష్టమైన భరిస్తూ మిమ్ములను చదివిస్తున్నారని గంజాయి మత్తుపదార్థాలకు అలవాటు పడవద్దని అందరం చేయి చేయి కలిపి గంజాయిని మత్తు పదార్థాలని నిర్మూలిద్దామని వారన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాలిటెక్నిక్ సిబ్బంది విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు