డ్రగ్స్ వలన కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన
సిఐ శ్రీను నాయక్ ,ఎస్సై ఏడు కొండలు
తుంగతుర్తి :జులై 18 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఎవరైనా సరే డ్రగ్స్ తీసుకున్న, విక్రయించిన నిల్వ ఉంచుకున్న శిక్షలు తప్పవని తుంగతుర్తి సీఐ శ్రీనివాస్ ఎస్సై ఏడుకొండలు అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం సిపి ఆదేశాల మేరకు డ్రగ్స్ వలన కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ప్రస్తుతం యువత డ్రగ్స్ కు అలవాటు పడ్డారని ఇలా వాడుతూ దొరికితే జీవితంలో ప్రభుత్వ ఉద్యోగానికి పనికి రాకుండా అవుతున్నారని అందుకు డ్రగ్స్ వాడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. మత్తు పదార్థాలు సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలతో పాటు విలువైన జీవితం అంధకారం కానుందని హెచ్చరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు విద్యార్థులు, యువత భాగస్వాములు కావాలని సీఐ శీను నాయక్, ఎస్ఐ ఏడుకొండలు కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.