పాఠశాలలో చిన్నారుల సందడి
తిరుమలగిరి 15 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
బాలల దినోత్సవ సందర్భంగా తిరుమలగిరిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బాలల పండుగ నిర్వహించారు ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులందరూ హాజరైనారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అందరూ విద్యార్థుల తల్లిదండ్రులకు కంకణం కట్టి తెలియజేస్తూ విద్యార్థులను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపి విద్యార్థులు బాగా చదివేలా ప్రోత్సహించాలని అదేవిధంగా కంకణాల కట్టి మంచి ఫలితాలు సాధిస్తామని విద్యార్థుల చేత మాట తీసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులందరూ కొబ్బరికాయలు, పువ్వు లతొ నెహ్రూ సరస్వతి ఫోటోలకు సమర్పించినారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ తల్లిదండ్రుల పట్ల శ్రద్ద వహించాలని అన్నారు